అల్లు అర్జున్, త్రివిక్రమ్‌లది సూపర్ హిట్ కాంబినేషన్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో.. ఇలా హ్యాట్రిక్ విజయాలు అందుకొన్నారు. అలా వైకుంఠపురములో అయితే బాక్సాఫీసు రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ కమర్షియల్ యాడ్ కూడా చేశారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ ప్రయాణానికి రంగం సిద్ధమవుతున్నట్టు టాక్. అవును.. త్రివిక్రమ్, బన్నీ మళ్లీ కలిసి పనిచేయబోతున్నారు. ఇటీవల.. వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. కథ గురించిన చర్చలు ఇద్దరి మధ్యా నడిచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. అది పూర్తయిన వెంటనే బన్నీతో ప్రాజెక్ట్ సెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా… అల్లు అర్జున్ – పుష్ఫ 2 కూడా పూర్తయిపోతుంది.
మరోవైపు… అట్లీ కూడా అల్లు అర్జున్ కోసం ఓ స్క్రిప్టు రెడీ చేశాడు. తనతో కూడా బన్నీ సినిమా ఒకటి ఉంటుంది. అయితే అదెప్పుడన్నది క్లారిటీ లేదు. బన్నీ ఫస్ట్ ఆప్షన్ మాత్రం త్రివిక్రమే. ఒకవేళ పుష్ప 2 రెడీ అయ్యేనాటికి త్రివిక్రమ్ మహేష్ తో సినిమా పూర్తి చేసేస్తే.. అప్పుడు బన్నీ – త్రివిక్రమ్ కాంబో సెట్టయిపోతుంది. లేకపోతే.. అట్లీ ఎలానూ ఉన్నాడు. బన్నీ అయితే.. పుష్ప 2 ముగిసిన వెంటనే ఎలాంటి బ్రేకూ లేకుండా మరో సినిమాని వెంటనే సెట్స్‌పైకి తీసుకెళ్లాలన్న ప్లాన్‌లో ఉన్నాడు.