ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో గడపడానికి ప్రయత్నిస్తుంటాడు అల్లు అర్జున్. అటు అత్తగారింటికిగానీ, ఇటు పాలకొల్లుకు గానీ వెళ్లి వస్తుంటారు. పిల్లలతోనూ తగినంత సమయాన్ని గడుపుతుంటాడు. అంతేకానీ ఆ క్షణాలను అభిమానులతోనూ సరదాగా పంచుకుంటూ ఉంటాడు. తాజాగా ఆయన తనయ అల్లు అర్హతో తీసుకున్న వీడియో వైరల్ అవుతోంది. `నాన్నా నేను నువ్వు చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను` అని అల్లు అర్జున్ తన కుమార్తె అల్లు అర్హతో చెప్పించే ప్రయత్నం చేశారు. తన తండ్రి చెప్పిన మాటలను చివరి దాకా చెప్పిన అల్లు అర్హ చివరిలో మాత్రం నో నో అని చెప్పుకొచ్చింది. `చేసుకోవా చేసుకోవా` అంటూ కుమార్తెతో అల్లు అర్జున్ ఆడుకుంటున్న సన్నివేశం ప్రేక్షకులకు బాగా నచ్చుతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
https://twitter.com/alluarjun/status/1093808407448932352?s=21