పుష్ప 2 రిలీజ్ రోజు సంధ్యా ధియేటర్లో జరిగిన తొక్కిసలాటలో గాయపడి కోమాలోకి వెళ్లిన శ్రీతేజ అనే పిల్లవాడిని అల్లు అర్జున్ పరామర్శించారు. ఆయన పరామర్శకు పోలీసులు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. అల్లు అర్జున్ ఆస్పత్రికి వస్తున్నారంటే గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా పరామర్శించి ఇంటికి వెళ్లిపోయారు. దీంతో శ్రీతేజ్‌ను పరామర్శించలేదంటూ కొంత మంది చేసే విమర్శలకు చెక్ పెట్టినట్లయింది.
శ్రీతేజ్ అల్లుఅర్జున్ కు వీరాభిమాని. ఇప్పుడు ఆ పిల్లవాడి పరిస్థితి ఎలా ఉందో ఇంకా వైద్యులు ప్రకటించలేదు. మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల కోమాలోకి వెళ్లాడని పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కాస్త తెలివిలోకి వచ్చి ఉంటే అల్లు అర్జున్ ను చూసి ఆ పిల్లవాడి బ్రెయిన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది వైద్య పరంగా కూడా ఎంతో మేలు చేసే అవకాశం ఉందని అనుకోవచ్చు. అర్జున్ పరామర్శ తర్వాత శ్రీతేజ ఆరోగ్యం మెరుగుపడితే అద్భుతం అనుకోవచ్చు.
శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించలేదని చాలా విమర్శలు వచ్చాయి. అయితే తాను వెళ్లడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయన్న కారణంగానే ఆగిపోయానని అర్జున్ చెబుతూ వస్తున్నారు. చివరికి ఆయనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసుల అనుమతితో చివరికి పరామర్శించారు. తన మనసులో ఉన్న భారాన్ని దించేసుకున్నారు.