అల్లు అర్జున్ రిమాండ్ ముగియడంతో ఆయన నాంపల్లికోర్టులో వర్చువల్ గా హాజరయ్యారు. మరో రెండు వారాల్లో ఆయన రెగ్యులర్ బెయిల్ తీసుకోవాల్సి ఉంది. ఇందు కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో సోమవారానికి వాయిదా వేశారు. మామలుగా అయితే బెయిల్ గట్టిగా తిరస్కరించాలనుకుంటే ముందుగానే ప్రిపేర్ అయి ఉండేవారు.కానీ ఆలాంటి ఆలోచన లేదని ప్రభుత్వ లాయర్ స్పందనతో అర్థమవుతోందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
బెయిల్ తిరస్కరించాలని వాదించడానికి ప్రభుత్వం తరపు లాయర్లకు చాలా కారణాలు ఉన్నాయి. పోలీసులపై నిందలు వేయడం, ప్రెస్మీట్ పెట్టడం దగ్గర నుంచి ఆధారాలు ట్యాంపర్ చేసేలా సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఆలస్యం చేయాలని అనుకోవడంతో విచారణ వాయిదా పడింది. అయితే బెయిల్ ఇచ్చేయాలని ప్రభుత్వం అఫిడవిట్ వేసే చాన్సులు ఉండవు. అలా ఎప్పుడూ వేయరు. కానీ బలహీనమైన వాదనలు వినిపిస్తారు. బెయిల్ సులువుగా వచ్చేలా చేస్తారు.
ప్రస్తుత కేసు విషయంలో పోలీసులు ఎంత సీరియస్ గా ఉన్నారన్నది తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ కేసు విషయంలో పోలీసులు ఎక్కువగా కార్నర్ కు గురయ్యారు. నేషనల్ మీడియా కూడా వారినే తప్పు పట్టింది. అయితే ఈ కారణంగా ప్రత్యేకంగా ఆవేశపడి మరీ అల్లు అర్జున్ బెయిల్ ను క్యాన్సిల్ చేయించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు. మామూలుగా బెయిల్ రద్దు పిటిషన్ వేస్తారన్న ప్రచారం జరిగిదింది. అంత ప్రిపేరయినప్పుడు కౌంటర్ రెడీగా ఉండదని ఎవరూ అనుకోరు.