సింపుల్గా చేద్దామనుకుంటే చినిగి చేటంతయి..చాపంతవుతోందని ఓ సినిమాలో ఎల్బీ శ్రీరాం అంటాడు.. ఇప్పుడు పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యధియేటర్లో జరిగిన తొక్కిసలాట విషయంలో జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఎక్కడ స్టార్ట్ అయింది.. ఎక్కడికి వెళ్తోంది. ఎవరు పర్సనల్ గా తీసుకున్నారు.. ఎవరు బాధ్యతగా వ్యవహరిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ వివాదం అలా పెరిగిపోతూనే ఉంది.
సంధ్య ధియేటర్ తొక్కిసలాట జరిగిన తర్వాత ఒకరు చనిపోయి.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సహజంగా వారు సామాన్యులు. వారి ప్రాణాలకు విలువలేదు. అందుకే జనాభాలో ఒకరు తగ్గిపోయారన్నట్లుగా అతి సింపుల్ గా మీడియా రిపోర్టు చేసేసి ఊరుకుంది. కానీ ఎప్పుడైతే పోలీసులు అర్జున్ ను అరెస్టు చేశారో అప్పటి నుంచి మారిపోయింది. అర్జున్ ను అరెస్టు చేయడానికి పోలీసుల వాదన చాలా బలంగా ఉంది. టిక్కెట్లు కొనుక్కని కూర్చున్న వారిని అల్లు అర్జున్ ర్యాలీగా వచ్చి బయటకు తోసేసి..తొక్కిసలాటకు గురయ్యేలా చేశారు. ఇద్దరు చనిపోయారని చెప్పినా వెళ్లేటప్పుడు ర్యాలీ చేశారు. ఇది ప్రభుత్వ వాదన. అది దురదృష్టకరమని.. తాము బాధపడ్డామని సినిమా యూనిట్ చెబుతోంది.
కానీ చేతలు మాత్రం అలా లేవు. వారికి మద్దతుగా రాజకీయ పార్టీలు రంగంలోకి వచ్చి సోషల్ మీడియా సైన్యాలను రంగంలోకి దింపడంతో చేయిదాటిపోయింది. ఎవరు సలహా ఇచ్చారో.. ఎందుకు ఇచ్చారో కానీ లాన్ లో ఓదార్పు ప్రోగ్రాం లైవ్ పెట్టడంతో ఇక టాపిక్ ను ఎవరూ ఆపలేరని అర్థమైపోయింది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన స్పీచ్ వైరల్ అయిపోయింది. వైల్డ్ ఫైర్ గా మారింది.
అర్జున్ అరెస్టును రెండు రాజకీయ పార్టీలు తమ పొలిటికల్ గెయిన్స్ కోసం వాడుకున్నాయి. దీన్ని అల్లు అర్జున్ టీం గుర్తించిందో లేదో తెలియదు. ఆయన ఇప్పుడు వైల్డ్ ఫైర్ మధ్యలో ఉన్నారు. ఎలా ఎదుర్కొంటారో ?