స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సరైనోడు సినిమా నుండి ఓ సాంగ్ లీక్ అయినట్టు సమాచారం. అయితే ఓ ట్రెండీ సినిమా లీక్ అవగానే నెట్ లో హల్ చల్ చేయడం మాములే కాని ఇవేమి జరుగకుండానే తమ సినిమాలోని సాంగ్ లీక్ అయిందని గమనించిన చిత్రయూనిట్. సాంగ్ ఎక్కడైనా వాడినా.. రిలీజ్ కు ముందే ఎక్కడైనా ప్లే చేసినా సరే తీసుకునే చట్టపరమైన చర్యలకు భాధ్యులవుతారని హెచ్చరించారు.
బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించారు. అయితే మరో పక్క ఈ సినిమా సాంగ్ లీక్ అవడం దానికి దర్శక నిర్మాతలు వార్నింగ్ ఇవ్వడం అంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బొలివియా ట్రిప్ లో ఉన్న సరైనోడు టీం అక్కడ సాంగ్ షూట్ జరుపుకుని రానుంది. మరి సరైనోడు సినిమా సాంగ్ నిజంగా లీక్ అయ్యిందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.