సుకుమార్-బన్నీ సినిమా ప్రకటనకు ముందు రోజు ఏం జరిగింది? దీని మీద ఆసక్తికర విషయం తెలుస్తోంది. అల్లు అరవింద్ నేరుగా మహేష్ సతీమణి నమ్రతను కలిసారు. సుకమార్-బన్నీ సినిమాను మైత్రీ బ్యానర్ లో చేస్తామని, ఆ కథ మహేష్ కు ఎలాగూ నచ్చలేదు కదా? తాము చేసుకుంటామని చెప్పారు. అందుకు బదులుగా తాము గీతా ఆర్ట్స్ లో మహేష్ తో ఓ సినిమా చేస్తామని చెప్పారని బోగట్టా. అదేం లేదని, తాము సమాంతరంగా రెండు సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నమ్రత వివరించినట్లు తెలుస్తోంది. దాంతో అరవింద్ ఇక మాట్లాడలేక వెనక్కు వచ్చారని బోగట్టా.
ఇదిలావుంటే మహేష్ ఇలా రెస్పాండ్ అవుతారని, వ్యవహారం ఇలా టర్న్ తీసుకుంటుందని మైత్రీ మూవీస్ కానీ, సుకుమార్ కానీ అనుకోలేదు. మీడియా ఇలా రెస్పాండ్ అవుతుందని, కానీ, ఇన్ని కథనాలు వస్తాయని అనుకోలేదు. దీన్ని ఎలా మేనేజ్ చేయాలని, వ్యవహారం మొత్తం పాజిటివ్ ఎలా చేయాలని నిన్నంతా సుకుమార్-మైత్రీ-లు కలిసి డిస్కషన్లు సాగించినట్లు తెలుస్తోంది.
పీఆర్ టీమ్ అత్యుత్సాహం అని నెట్టేస్తే ఎలా వుంటుంది అని కూడా డిస్కషన్లు సాగినట్లు తెలుస్తోంది. అయిపోయింది, అయిపోయింది, ఇక కొంతకాలం ఇలా సైలంట్ గా వదిలేయాలని ఆఖరికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.