గీత గోవిందం ఇచ్చిన ఉత్సాహంతోనో ఏమో.. గీతా ఆర్ట్స్ జోరు పెంచింది. ఓవైపు గీత గోవిందం థియేటర్లలో ఉండగానే… `పేపర్ బాయ్` సినిమాని విడుదల చేయడానికి ముందుకొచ్చి ఆశ్చర్యపరిచింది. మరోవైపు చిత్ర నిర్మాణంలోనూ స్పీడు స్పీడుగా సాగిపోతోంది. కొత్త కథలు విని… కొత్త దర్శకుల చేతిలో అడ్వాన్సులు పెట్టేస్తోంది. తాజాగా మురుగదాస్ దగ్గర శిష్యరికం చేసిన సింథిల్ అనే సహాయ దర్శకుడిని దర్శకుడిగా ప్రమోట్ చేయబోతోంది గీతా ఆర్ట్స్. సింథిల్ చెప్పిన రెండు కథల్ని గీతా ఆర్ట్స్ ఓకే చేసింది. ఓ సినిమా అల్లు అర్జున్‌తో, మరో సినిమా అల్లు శిరీష్‌తో ఉండబోతున్నాయని టాక్. అయితే ముందుగా అల్లు శిరీష్ సినిమానే పట్టాలెక్కుతుందని సమాచారం. ఆ తరవాత.. బన్నీ సినిమాని మొదలెడతార్ట. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అడ్వాన్సులు ఆల్రెడీ.. సింథిల్కి అందేశాయని తెలుస్తోంది. ప్రస్తుతం `ఏబీసీడీ` అనే చిత్రంలో నటిస్తున్నాడు శిరీష్. అది పూర్తవ్వగానే… సింథిల్ దర్శకత్వంలో కథ పట్టాలెక్కుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.