ధృవ రిలీజ్ హడావుడిలో ఉన్న అల్లు అరవింద్ ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. అల్లు రామలింగయ్య పెద్ద కుమార్తె, అరవింద్ అక్కయ్య భారతి ఈరోజు తెల్లవారుఝామున హైదరాబాద్ తో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఆదివారం రాత్రి.. ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉత్సాహంగా గడిపిన అరవింద్ కుటుంబాన్ని భారతి మరణం విషాదంలో నెట్టి వేసినట్టైంది. ఈరోజు ధృవ ప్రమోషన్ కార్యక్రమాలన్నీ రద్దు అయ్యాయి. అత్తయ్య తో అల్లు అర్జున్‌కి మంచి సాన్నిహిత్యం ఉందని సమాచారం. ఇంటికి పెద్ద దిక్కు కావడంతో అల్లు కుటుంబానికి భారతి అంటే అమితమైన గౌరవం కూడా. భారతి కి ఇంకా పెళ్లికాలేదని, పెళ్లిపై అయిష్టత కారణంగానే ఆమె వివాహానికి దూరంగా ఉన్నారని, అందుకే అరవింద్ ఇంట్లోనే ఉంటున్నారని సమాచారం. మరోవైపు భారతి మరణంతో ధృవ ప్రమోషన్లకు అనుకోని బ్రేక్ పడినట్టైంది.