కమర్షియల్‌గా ఆశించిన రిజల్ట్ ‘ఒక్క క్షణం’ ఇవ్వలేదని అల్లు శిరీష్ స్వయంగా అంగీకరించాడు. థ్రిల్లర్ జానర్ కావడం, రిలీజ్ టైమ్… ఈ విధంగా సినిమా రిజల్ట్‌కి ఎన్నో రీజన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే… నటుడిగా అల్లు శిరీష్‌కి ఆ సినిమా ఒక మేలు చేసింది! అదేంటంటే… అతడి అభిమాన హీరో సూర్య సినిమాలో నటించే అవకాశం తెచ్చింది. అదెలా? అనుకుంటున్నారా! అయితే… చదవండి! సూర్య సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందనే విషయం గురించి అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు కె.వి. ఆనంద్ సినిమాలో 24 ఏళ్ళ కుర్రాడి క్యారెక్టర్ కోసం కొంతమంది నటులను చూస్తున్నార్ట. అప్పుడు ఎవరో నా గురించి ఆయనకు చెప్పగా… ఆ అబ్బాయి సినిమాలేవీ తాను చూడలేదని కె.వి. ఆనంద్ అన్నార్ట. వెంటనే నా స్నేహితులు ఆయనకు ‘ఒక్క క్షణం’ డీవీడీ పంపించార్ట. అందులో నా నటన ఆయనకు బాగా నచ్చేసింది. ఆ సినిమా చూసే నన్ను సెలెక్ట్ చేశానని నాతో చెప్పారు. సినిమా గురించి కూడా గొప్పగా మాట్లాడారు’’ అన్నారు.
సూర్య సినిమాలో మోహన్‌లాల్ కూడా నటిస్తున్నారు. జూలై 1 నుంచి లండన్‌లో ఈ సినిమా షూటిండ్ మొదలవుతుందని శిరీష్ తెలిపాడు. సెప్టెంబర్‌లో అతడి పార్ట్ షూట్ చేస్తారని అన్నాడు. అంతకు మించి క్యారెక్టర్ గురించి ఏమీ అడగొద్దని చెప్పిన శిరీష్… సినిమాలో అతడికి రొమాంటిక్ లీడ్ (హీరోయిన్) వుందని కన్ఫర్మ్ చేశాడు.