అల్లు శిరీష్ సినిమా వచ్చి చాలా కాలమైంది. ‘ఊర్వశివో రాక్షసివో’ తరవాత తన సినిమా ఒక్కటీ థియేటర్లలో రాలేదు. `టెడ్డీ` అనే సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఆ సినిమా గురించిన ఎలాంటి అప్ డేటూ లేదు. బహుశా కొత్త యేడాదిలో ఈ సినిమాని విడుదల చేయొచ్చు. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కి పచ్చ జెండా ఊపాడు శిరీష్. లోకేష్ అనే ఓ దర్శకుడి కథకు శిరీష్ ఓకే చెప్పాడు. ఇదో టైమ్ ట్రావెల్ జోనర్లో సాగే స్టోరీ. ఈ సినిమాకి ‘నిన్న – నేను – రేపు’ అనే టైటిల్ పెట్టారు. భూత భవిష్యత్ వర్తమానాల్లో జరిగే కథ ఇది. పాస్ట్, ఫ్యూచర్ రెండింటినీ ఈ కథలో చూపించబోతున్నారు. స్క్రిప్టు ఆల్రెడీ సిద్ధమైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ బయటకు రాబోతోంది. ‘టెడ్డీ’ కూడా ఓ కొత్త తరహా కథే! లవ్, యాక్షన్ అనే రెగ్యులర్ జోనర్లో సినిమాలు చేయకుండా డిఫరెంట్ గా ప్రయత్నించడమే.. శిరీష్‌కి మంచిది. అప్పుడే తనదైన ఓ ముద్ర వేయగలడు.