అమలాపాల్… న్యూడ్ గా నటించిన సినిమా అంటూ.. తెగ ప్రచారం అయిపోతున్న “ఆమె” సినిమాలో అంతకు మించిన విషయం ఉందనిపించేలా..” ట్రైలర్”ను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో అమలాపాల్.. ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదు. న్యూడ్‌గా నటించడానికే సిద్ధమయిన తర్వాత.. ఇక వేరే విషయాల్లో.. పట్టింపులు ఎందుకనుకుందేమో కానీ.. అలవోకగా.. సిగరెట్లు తాగేస్తూ.. మద్యం సిప్ చేస్తూ.. డైలాగులు చెప్పేసింది. అయితే ఇవి ఎక్కడా అసజంగా ఉండవని ట్రైలర్ కట్ చూపిస్తోంది. బెట్టింగ్‌లకు బానిసైన ఓ యువతి.. ఎదుర్కొన్న పరిణామాలు.. ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఆ క్రమంలో.. సీరియల్ కిల్లర్ ఎంట్రీతో ధ్రిల్లర్ గా రూపాంతరం చెందుతుందని ట్రైలర్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఊహించని ముగింపుతో… ఎవరూ ఊహించలేని… ధ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇస్తుందని.. అంచనాలు పెంచేసుకోవచ్చు. ఇప్పటి వరకూ.. ఈ సినిమా..ఏదో మహిళలకు సందేశం అన్నట్లుగా చెప్పుకొస్తున్నారు కానీ.. ఇందులో.. ఎలాంటి సందేశాలు ఇవ్వబోవడం లేదని.. కేవలం ధ్రిల్లర్ సినిమాలు ఇష్టడేవారికేనని అర్థం చేసుకోవచ్చు. అయితే తీసుకుంటే మాత్రం.. అమలాపాల్‌ను ఓ సందేశంగా తీసుకోవచ్చు. అంతగా.. ఈ సినిమాలో అమలాపాల్ మెరిసిపోవడం ఖాయమని.. ట్రైలర్ ద్వారా అంచనా వేసుకోవచ్చు.