సౌత్ సిని భామలు పెళ్లయ్యాక పూర్తిగా సినిమాలకు దూరమైన వారు కొందరైతే.. ఒకవేళ అవకాశం వచ్చి చేసినా హీరోయిన్ గా కాకుండా ఏవో చిన్న రోల్స్ చేసేవారు ఉన్నారు. అయితే దీనికి తాను విరుద్ధం అంటుంది హాట్ గాళ్ అమలా పాల్. మలయాళం నుండి వచ్చిన ఈ భామ అనతి కాలంలోనే తమిళ్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించింది.. ఇక ఆ మార్గంలోనే దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను ప్రేమించి పెళ్లాడిన సంగతి మనకు తెలిసిందే.
అయితే పెళ్లైన కొత్తలో తాను సినిమాలకు స్వస్తి చెబుతా అన్నట్టు కటింగులు ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలు చేసేందుకు సిగ్నల్ ఇస్తుంది. అంతేకాదు పెళ్లి తర్వాత చేసిన రెండు మూడు ఆర్ట్ మూవీస్ ఫలితం అమ్మడిలో మార్పుని తెచ్చాయనుకుంట, అందుకే ఇక తాను గ్లామర్ షో చేసేందుకు కూడా రెడీ అంటుంది. పెళ్లై సినిమాలు తీయడమే గొప్ప అనుకుంటుంటే అమ్మడు హాట్ గా కూడా నటించేందుకు రెడీ అంటుందంటే సూపర్ అనాల్సిందే. అయితే ఇక అలాంటి సినిమాలకు తనరెమ్యునరేషన్ కూడా 80 లక్షల పైనే అంటుంది అమలా.. పెళ్లైన ఈ భామకు 80 లక్షలు ఇచ్చి హీరోయిన్ గా తీసుకునే కంటే అదే ఎమౌంట్ తో స్టార్ హీరోయిన్ ను తీసుకునే అవకాశం ఉంది. మరి అమలా అర్ధం కాని స్ట్రాటజీతో తమిళ దర్శక నిర్మాతలు తలలు హీటెక్కిపోతున్నాయన్నది నిజం.