ఇంత కాలం పక్కన పెట్టేసిన విజయసాయిరెడ్డిని బలి పశువును చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గ ట్టిగానే ప్లాన్ చేశారు. ఆయన ఇంచార్జ్ గా ఉన్న ఉత్తరాంధ్రకు వైవీ సుబ్బారెడ్డిని నియమించేలా చూసుకున్నరు. ఇంచార్జ్ మంత్రిగా మంత్రి విడదల రజనీని నియమించారు. అంటే విజయసాయిరెడ్డికి అక్కడ ప్లేస్ లేకుండా చేశారు. అయినా అక్కడ జోక్యం చేసుకుంటున్నారని.. బాలినేని వదిలేసిన పదవిని ఇచ్చారు. అందులోనూ సగం కత్తిరించి.. కష్టమేనని వైసీపీ అనుకుంటున్న కోస్తా జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. అయితే విజయసాయిరెడ్డికి ఏ దారి తెలుస్తున్నట్లుగా లేదు. ముందుగా కరణం, ఆమంచి పంచాయతీ తీర్చాల్సిన సమస్య ఆయన ముందుకు వచ్చింది. గతంలో ఇలాంటి పంచాయతీలు సజ్జల తీర్చేవారు. చాలా సార్లు ఆమంచిని.. కరణంను పిలిపించి మాట్లాడారు. కనీ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఇంచార్జ్ గా విజయసాయిరెడ్డి ఉండటంతో ఆయనకే అప్పచెప్పారు. నిజానికి కరణంను చేర్చుకోవాలన్న నిర్ణయం సజ్జలది. కానీ ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆయనపైనే పడింది. కరణంతో పాటు ఆమంచిని పిలిచి మాట్లాడిన విజయసాయిరెడ్డి ఏం చేయాలన్నదానిపై క్లారిటీకి రాలేకపోతున్నారు. పర్చూరు సమన్వయకర్తగా ఉన్న ఆమంచిని చరాలలో జోక్యం చేసుకోవద్దని చెప్పారు.కానీ ఆయన వినడం లేదు. ఆయన తీరు చూస్తూంటే వచ్చే ఎన్నికల్లో పార్టీతో సంబంధం లేకుండా ఆయన చీరాల నుంచి పోటీ చేస్తారేమో అన్న ప్రచారం జరుగుతోంది. మరో వైపు కరణం వెంకటేష్ మాత్రం.. తగ్గడం లేదు. వీరిద్దరిలో ఒకర్నే పార్టీలో ఉంచుకోవాల్సి వస్తుందని.. మరొకర్ని బయటకు పంపక తప్పదని భావిస్తున్నారు.