కేంద్రం విడుదల చేసిన కాలుష్య కారక పరిశ్రమల జాబితాలో బ్యాటరీస్ విభాగం లేదని ఏపీలో నిన్నటి నుంచి ప్రచారం హోరెత్తిస్తున్నారు. అయితే ఇప్పుడే కాదు.. బ్యాటరీస్ పరిశ్రమకాలుష్య కారక పరిశ్రమల విభాగంలో ఎప్పుడూ లేదని కొంతమంది గుర్తు చేస్తున్నారు. కేంద్రం లోక్సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రమే ఇచ్చింది. కొత్తగా విధానాలు మార్చుకోలేద… అంటే కాలుష్య కారక పరిశ్రమల జాబితాలో బ్యాటరీస్ విభాగం లేదు. నిజానికి బ్యాటరీ పరిశ్రమ వల్ల ప్రమాదకర వ్యర్థాలు వస్తాయని.. కాలుష్యం వస్తుందని ఇప్పటి వరకూ ఎవరూ చెప్పలేదు కూడా. అసలు పారిశ్రామిక కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీల్లో సిమెంట్ పరిశ్రమలు వంటివి ఉన్నాయి.
కాలుష్య కారక పరిశ్రమల జాబితాలో బ్యాటరీస్ ఫ్యాక్టరీలు లేనప్పుడే ఏపీ సర్కార్.. అమరరరాజాకు కాలుష్యం కింద నోటీసులు జారీ చేసింది . మూసివేయించింది కూడా. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతోనే విచారణ జరిపించి.. నివేదికలు సిద్ధం చేయించి.. దండం పెట్టి బయటకు వెళ్లిపొమ్మన్నామని చెబుతోంది. అప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడప్పుడు కేంద్రంప్రస్తావన తీసుకు వస్తూ ఉంటారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు తాము మూత వేస్తున్నామని… చెబుతూంటారు. అప్పుడప్పుడూ కోర్టుల ప్రస్తావన కూడా తెస్తూంటారు. కోర్టులు కూడా అమరరాజా పరిశ్రమ కాలుష్యం వెదజల్లుతోందని నిర్ధారించాయని చెబుతూ ఉంటారు. కానీ వాటికి ప్రత్యేకమైన ఆధారాలు ఉండవు.
భారీ కాలుష్య కారక పరిశ్రమల జాబితాలో లేకపోయినప్పటికీ… అమరారాజా నుంచి కాలుష్యం రాదని అర్థం కాదు. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే ఏపీ ప్రభుత్వం తాము చేయాలనుకున్నది చేస్తోంది. కానీ అమరరాజాకు సపోర్ట్ చేయాలనుకున్న వారికి మాత్రం కేంద్రం ఇచ్చిన సమాధానం… ఓ అస్త్రంగా మారింది. సోషల్ మీడియాలో అదేపనిగా ఆ పరిశ్రమ కాలుష్య కారకంకాదు అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం తాను చేయాలనుకున్నది చేస్తోంది. కేంద్ర నిబంధనలు.. లాంటివి ఎప్పుడూ పట్టించుకోలేదు. లోక్సభలో కేంద్రం చెప్పిందికదా అని ఇప్పుడు లైట్ తీసుకోదు.