అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే తెచ్చుకుందామని ఆరు నెలలు వెయిట్ చేసి.. మంచి సమయం చూసి మరీ సుప్రీంకోర్టుకు వచ్చిన ఏపీ ప్రభుత్వానికి మొదటి అడుగులో అంత సానుకూలత లభించలేదు. ఈ పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నిరాకరించారు. ఉదయం కోర్టు ప్రారంభమైన తర్వాత బెంచ్ ముందుకు అమరావతి పిటిషన్లు వచ్చాయి. దీంతో నాట్ ఫోర్ మి అని చీఫ్ జస్టిస్ ప్రకటించారు. వేరే బెంచ్ ముందు వీలైనంత త్వరగా విచారణ జరపాలని ఆదేశించింది.
జస్టిస్ యూయూ లలిత్ సుప్రీంకోర్టు జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టక ముందు సీనియర్ లాయర్‌గా అనేక కేసుల్ని వాదించారు. అలా వాదించిన కేసుల్లో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. అప్పట్లో ఆయన జగన్ కౌన్సిల్లో సీనియర్ లాయర్‌గా ఉన్నారు. అదే సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన తర్వాత కొన్ని కేసుల్లో విభజన చట్టంపై తన అభిప్రాయం వినిపించానని అందుకే ఈ పిటిషన్లపై విచారణ .. తాను సభ్యుడిగా లేని బెంచ్ ముందు జరగాలని చీఫ్ జస్టిస్ అన్నారు. దీంతో కేసు విచారణ వేరే బెంచ్‌కు బదిలీ కానుంది.
చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ ఈ నెల ఎనిమిదో తేదీన పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ సింగ్ తదుపరి చీఫ్ జస్టిస్ అవుతారు. అమరావతి కేసుల విచారణ మరో బెంచ్‌పై ఎప్పటికి వస్తుందో స్పష్టలేదు. మళ్లీ రోస్టర్ ప్రకారం ఈ కేసుల్ని లిస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే వేగంగా విచారణ జరిగేలా చూసుకునేందుకు ఏపీ ప్రభు్తవంపై తీవ్రంగా ప్రయత్నిస్తోంది.