పవర్ బోట్ రేసింగ్లలో ఫార్ములా వన్‌గా ప్రసిద్ధి పొందిన ఎఫ్1 హెచ్2 ప్రపంచ ఛాంపియన్ షిప్ నిర్వహణకు అమరావతి ఆతిధ్యం ఇవ్వబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైక్లాస్ టూరిస్టులను ఆకట్టుకునే అవకాశం ఉండటంతో.. ఈ చాంపియన్ షిప్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. నవంబరు 16 నుంచి మూడు రోజుల పాటు ఈ చాంపియన్ షిప్ జరుగుతుంది. అమరావతి ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు ఇది మరో అవకాశం. ఫార్ములా1 పవర్‌బోట్ రేసింగ్‌లో ప్రసిద్ధి చెందిన ఎఫ్1హెచ్2వో ప్రపంచ చాంపియన్‌షిప్ నకు ఆతిథ్యమిచ్చే గొప్ప అవకాశం భారత్‌లోని అనేక నగరాలను కాదని అమరావతికి ఇచ్చారు. దక్కింది. అమరావతిలోని భవానీ ఐలాండ్‌లో ఎఫ్1హెచ్2వో ప్రపంచ చాంపియన్‌షిప్ ను నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 2018 వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఎఫ్1 వాటర్ స్పోర్ట్స్ నిర్వహణ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 8 మహానగరాల్లో వీటిని నిర్వహిస్తుంది.
పోర్చుగల్, లండన్, ఫ్రాన్స్, చైనా, దుబాయ్‌తో పాటు ఈసారి భారత్‌కు కూడా చోటు కల్పించారు. భారత్ నుంచి అమరావతికి ఆ అవకాశం దక్కింది. మే నెల 18న పోర్చుగల్‌లో మొదలయ్యే ఈ ఛాంపియన్ షిప్ డిసెంబరు 15న షార్జాలో ముగుస్తుంది. నవంబరు 17 నుంచి వరకూ అమరావతి వేదికగా జరుగుతుంది. ఇది వరల్డ్ చాంపియన్‌షిప్ కావడంతో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు అమరావతికి వస్తారు. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పర్యాటక శాఖ వారికి అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు స్టార్ హోటల్ రూమ్స్, అంతర్జాతీయ స్థాయి ఫుడ్‌కోర్టులు ఏర్పాటుపై దృష్టిపెట్టింది. అంతర్జాతీయ ఎఫ్1హెచ్2వో చాంపియన్‌షి్‌పను ఏపీకి రప్పించేందుకు సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేశారు. ఎఫ్1హెచ్2వో ప్రతినిధులతో ఏడాది పాటు చర్చలు జరిపారు. అమరావతికి ఉన్న విశిష్టిత, ముఖ్యంగా పోటీలు నిర్వహణకు ఉన్న మౌలిక సదుపాయాల గురించి వివరించారు.
ఎఫ్1హెచ్2వో ప్రతినిధులు భవానీ ఐల్యాండ్‌తో పాటు సమీపంలోని 11 ఐల్యాండ్స్‌ను పలుమార్లు పరిశీలించారు. చివరకు అమరావతికి ఓకే చెప్పారు. అమరావతిలో అద్భుతమైన 11 ఐల్యాండ్స్‌తో పాటు 23 కిలోమీటర్ల వాటర్ స్టోరేజ్ ఉంది. ఇది అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు అనువుగా ఉంటుంది. ఇప్పటికే అక్కడ ప్రభుత్వం తరపున కల్పించాల్సిన మౌలిక వసతులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు .. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ను నిర్వహించిన చంద్రబాబు… అందరి దృష్టిని ఆకర్షించారు. నవ్యాంధ్రలో ఎఫ్1హెచ్2వో చాంపియన్ షిప్‌తో స్పోర్ట్స్ ఇన్నింగ్స్ ప్రారంభించారనుకోవచ్చు.