వర్షం కారణంగా అమరావతి ప్రాంతంలోని నేలపాడు గ్రామానికి సంబంధించి రైతులకు ఫ్లాట్ల నెంబర్ల కేటాయింపు తతంగం వాయిదా పడింది. మొదట నేలపాడులో తలపెట్టిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి భద్రత పేరిట తుళ్లూరుకు తరలించినా ఇప్పుడు అది కూడా వాయిదా వేశారు. 2014 డిసెంబర్ నుంచి ప్రారంభమైన భూ సమీకరణ ప్రక్రియలో 33వేల ఎకరాలు సమీకరించడం పెద్ద విజయంగానే ప్రభుత్వం భావిస్తున్నదిమొదట చెప్పిన ప్రకారమైతే భూసమీకరణకు భూములిచ్చిన రైతులకు గత ఏడాది మేలోనే ప్లోట్లు అప్పగించాల్సింది. కాని ప్రభుత్వం ఇప్పటివరకు ఆ పని చేయలేదు. . ఈ ఏడాది జనవరి, మార్చి ఇలా పొడగించుకుంటూ జూన్ వరకు నడిపారు. ఇప్పుడు కూడా సిఆర్డిఎ అధికారులు ఇప్పుడు ఫ్లాట్ల నెంబర్లను మాత్రమే కేటాయిస్తామని చెబుతున్నారు. లేఅవుట్ వేసి కేటాయింపులు చేసి ఇవ్వడం సాధ్యం కాలేదంటూ విస్తీర్ణాల వారీగా ప్లాట్లను ఎంపిక చేశారు. తమకు వచ్చే విస్తీర్ణం మేరకు ఎటువంటి ప్లాట్లు ఎన్ని కావాలనే విషయాన్ని రైతులే కోరుకోవాలి. ఇందుకోసం (9.18) దరఖాస్తు సమర్పించాలి. న ఆ దరఖాస్తుల ఆధారంగా ఎవరెవరికి ఎన్నెన్ని ప్లాట్లు వస్తాయనే అధికారులుఒక అభిప్రాయానికి వచ్చి నెంబర్లు వేశారు. ఉదాహరణకు ఒక రైతుకు వంద గజాల ప్లాట్లు కావాల్సి ఉంటే, వాటికి లాటరీ వేసి ో ఏ నెంబరు వస్తే దాన్ని కేటాయిస్తారు. అదే రైతు 500 గజాల ప్లాట్లు కోరుకుని ఉంటే మరో లాటరీ ద్వారా నెంబరు కేటాయిస్తారు. . ఆ తర్వాత రైతులకొచ్చిన నెంబర్ల వారీగా వారికి ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసి 15 రోజుల్లోపు ఇస్తామంటున్నారు. ఒక్కసారి నెంబరు కేటాయించితే భూమి ఇచ్చినట్లే గనక రైతుకు కౌలు చెల్లించాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు. భూసమీకరణ రైతులకు రెండో ఏడాది కౌలు ఇప్పటివరకూ చెల్లించిందిలేదు. దీనిపై సాధారణ రైతులలో అసంతృప్తిగా ఉంది. అయితే రైతులకు కౌలు చెల్లింపులు చేయగల ఆర్థిక వనరులు సిఆర్డిఎ దగ్గర లేవు. కనుక 9.18 దరఖాస్తుల ఆధారంగా వారి ప్లాట్లకు నెంబర్లు కేటాయించేస్తే, వారికి ఇక కౌలు చెల్లించాల్సిన అవసరముండదనేది ఇక్కడ వ్యూహంగా వుంది. నిజంగా భూములు స్వాధీనం చేయకపోయినప్పటికీ హడావుడిగా ప్లాట్ల నెంబర్లు ఇచ్చేసి ఆర్థిక భారం దించుకోవడానికి పంపిణీ ఉపయోగపడుతుంది. దాంతో పాటే రైతులలో వున్న సందేహాలు కొంతైనా తగ్గి మరికొంత కాలం నిరీక్షిస్తారనే అంచనాతో ప్రభుత్వం వుంది. ఇప్పుడు వాయిదా పడిన ఈ కార్యక్రమం మళ్లీ త్వరలోనే వుంటుందని అధికారులు చెబుతున్నారు గాని అదెప్పుడు ఎలా జరుగుతుందో ఏ కొత్త అంశాలు ముందుకు తెస్తుందో చూడాల్సిందే!