భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు అప్పుడప్పుడూ కొన్ని కీలకమైన అంశాలతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూంటారు. అయితే ఆయనపై ఉన్న ప్రో వైసీపీ ఇమేజ్ కారణంగా ఆయన విమర్శలన్నీ ఎప్పుడూ లైటర్వీన్లో ప్రజల్లోకి వెళ్తూంటాయి. తాజాగా పెట్రోల్ రేట్ల తగ్గింపుపై ఆయన ఓ ప్రకటన చేశారు. అదేమిటంటే అమరావతి కట్టడం లేదు కాబట్టి అమరావతి సెస్ పేరుతో వసూలు చేస్తున్న మొత్తాన్ని అయినా తగ్గించాలనేది ఆయన డిమాండ్.
పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో అమరావతి సెస్ ఉందనేది ఇంత వరకూ ఎవరికీ తెలియదు. సోము వీర్రాజుకే తెలిసినట్లుగా ఉంది. అది కూడా ఏకంగా నాలుగు రూపాయలని సోము వీర్రాజు అంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికలో ఇచ్చిన ఫుల్ పేజీ యాడ్ ప్రకారం 31 శాతం వ్యాట్ తో పాటు నాలుగు రూపాయల అదనపు వ్యాట్ అలాగే మరో రూపాయి రోడ్ సెస్ విధిస్తోంది. అందుకే కానీ ఇందులో అదనపు సెస్ లేదు. బహుశా.. సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వం చెప్పిన రూ. నాలుగు అదనపు వ్యాట్‌లో అమరావతి వ్యాట్ ఉందేమో స్పష్టత లేదు.
సోము వీర్రాజు అందులో అమరావతి సెస్ ఉందని ఎవరు చెప్పారో కానీ ఆయన మాత్రం అదే పనిగా అమరావతి సెస్ .. అమరావతి సెస్ అంటూ హడావుడి చేస్తున్నారు. బహుశా… ఈ విషయంలోనూ వివాదాస్పదం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారేమో.. టాపిక్ డైవర్ట్ చేయడానికి కొత్త ప్లానేమో అన్న సందేహం కొంత మందికి వస్తోంది. ఎందుకంటే సోము వీర్రాజు ఇమేజ్ అలా ఉంది మరి. !