అమరావతిలో నివాసం ఉండే జగన్ మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్లాలంటే కర్ఫ్యూ ప్రకటించాలి. అంతేనా ఆయన వెళ్లే రాజధాని గ్రామాల్లో ఇళ్ల ముందు పరదాలు పెట్టి ఫోర్స్ ను నిలబెట్టాలి. అలా చేసిన తర్వాత ఆయన కాన్వాయ్ ఆ దారి గుండా కనీసం ఎనబై కిలోమీటర్ల వేగంతో వెళ్లిపోతుంది. కానీ ఇప్పుడు సీఎం వెళ్తూంటే..రాజధాని రైతులు అంతా పూల వర్షం కురిపించారు. ఆయన వెళ్లే దారి నిండా పూలు పోశారు. పూల దారి పై చంద్రబాబు సెక్రటేరియట్ కు వెళ్లారు. నాడు – నేడు ఇదే తేడా.
జగన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడమే కాదు.. రైతులతో తమకు ఏదో ఫ్యాక్షన్ గొడవులు ఉన్నట్లుగా వ్యవహరించారు. ఓ ప్రజా పాలకుడిగా తాను ఏం చెప్పాడో దాన్ని అడ్డంగా ఉల్లంఘించారు. అందుకు ప్రతిఫలంగా ఆయన పరదాలు కట్టుకుని తిరగాల్సి వచ్చింది. ఆ రాజకీయాలు ఏమీ మేలు చేయకపోగా మొదటికే మోసం తెచ్చాయి. చంద్రబాబు అమరావతి రైతులకు మద్దతుగా ఓ సారి వస్తే.. ఇతర ప్రాంతాల వారిని తీసుకొచ్చి రాళ్లేయించారు. ఆ నింద కూడా అమరావతి రైతులపై వేశారు. సవాంగ్ అనే ఘతన వహించిన డీజీపీ అది నిరసన వ్యక్తీకరణ అన్నారు.
ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. చంద్రబాబు పూల దారిలో సెక్రటేరియట్ కు వెళ్లారు. ఇప్పుడు కూడా జగన్ కనీసం సెక్యూరిటీ లేకుండా బయట అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఆయన ఇప్పుుడ ప్రతిపక్ష నేత కూడా కాదు కాబట్టి.. గట్టి బందోబస్తు .. భద్రత ఇచ్చే అవకాశం లేదు. మాజీ సీఎంగా ఆయనకు మహా అయితే టూ ప్లస్ టూ భద్రత కల్పిస్తారో.. లేకపోతే అది కూడా తీసేస్తారో క్లారిటీ రావాల్సి ఉంది.