అమరావతి విషయంలో ఇప్పటి వరకూ ఇటూ ఇటూ కాకుండా ఉంటూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అమరావతి వైపు క్లియర్ గా నిలబడింది. అమరావతి రాజధాని విభజన చట్టం ప్రకారం ఏర్పడిందని స్పష్టం చేస్తూ.. లోక్ సభలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా అని ఆయన ప్రశ్న వేశారు. దీనికి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ఏపీ రాజధాని అంశం ప్రస్తుతం కోర్టుల పరిధిలో ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దీనిపై మాట్లాడటం కోర్టు ధిక్కరణ అవుతుందన్నరు.
అణరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటిపై చేసిందని నిత్యానందరాయ్ తన సమాధానంలో స్పష్టం చేశారు. విభజన చట్టంలోని ఐదు, ఆరు సెక్షన్ల ప్రకారమే అమరావతి ఏర్పాటయిందని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రి సమాధానంతో అమరావతి రాజధాని విషయంలో కేంద్రం స్పష్టత ఇచ్చినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏపీ ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల చట్టాలు.. మళ్లీ వెనక్కి తీసుకున్నా.. అసలు అలాంటి వాటిపై తమను సంప్రదించలేదని కేంద్రం చెబుతోంది. మూడు రాజధానుల కోసం చేసిన చట్టాలతో తమకు సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ స్పందన ప్రకారం.. అమరావతి రాజధానిగా నిర్ణయం అయిపోయింది… ఇక కొత్తగా విభజన చట్టంలో మార్పులు చేయకుండా ఎలాంటి రాజధానులు ఏర్పాటు చేయలేరని చెప్పినట్లయిందని నిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టుకు కూడా ఇదే చెబితే… ఇక ఏపీ ప్రభుత్వ మూడు రాజధానుల నాటకం ముగిసిపోతుందని.. రాజకీయవర్గాలు చెబుతున్నాయి.