రాజధాని అమరావతి భూ సమీకరణకోసం ప్రత్యేక చట్టం చేసిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ భూ సేకరణ ఎలా చేస్తుందని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. న్యాయస్తానంలో సవాలు చేయబోతున్నారు. తాడేపల్లి మంగళగిరి మండలాల్లో 2400 ఎకరాలు సేకరించడానికి ప్రభుత్వం హుకుం జారీ చేసిన నేపథ్యంలో రైతులు కూడా కోర్టులకు వెళుతున్నారు. ఉద్దండరాయని పాలెంల్లో . ప్రభుత్వం తరపున సామాజిక అధ్యయనం నిర్వహించిన సంస్థ అక్కడ ధర ఎకరాకు అయిదు లక్షలు వున్నట్టు నివేదించింది. . నిజానికి ప్రభుత్వం ఇప్పటికే అక్కడ సమీకరించి సింగపూర్ కన్సార్టియంకు అప్పగించిన భూమి ఎకరాకు నాలుగు కోట్ల రూపాయలు ధర నిర్ణయించారు. వారు వ్యాపారం చేసుకోవడానికి సిద్ధమైపోయారు. సమీకరణలో భాగంగా తమకు వచ్చిన భూమిని గాని లేక దాంతో నిమిత్తం లేకుండా గాని రైతులు భూములు అమ్ముకోవాలంటే అక్కడ కోటిన్నర, కోటి80 లక్షల వరకూ ధర పలుకుతున్నది. అలాటి చోట కేవలం అయిదు లక్షల పరిహారం ఇచ్చి తీసుకోవాలనుకోవడం దారుణమని రైతులు ప్రశ్నిస్తున్నారు.పైగా ఆ భూములను వారు డెవలప్ చేసి లాభాలు పొందడానికి వీలుగా రైతుల క్రయ విక్రయాలపై నిషేధం విధించారు. రైతుల నుంచి సేకరించిన భూమి ఇచ్చి ఇన్ఫ్రా సౌకర్యాల బాధ్యత కల్పించి కూడా ప్రభుత్వం కేవలం 42 శాతం వాటాతో సరిపెట్టుకోవడం దిగ్బ్రాంతి కలిగిస్తున్నది. స్టార్టప్ క్యాపిటల్ కింద ఎంపిక చేసిన ఉద్దండరాయని పాలం, లింగాయపాలెం అభివృద్ధి కావడానికి ఇరవయ్యేళ్లు పడుతుందని ప్రభుత్వం చెబుతుంటే మొత్తం 29 గ్రామాలు అభివృద్ధి కావడానికి విజయవాడ గుంటూరులతో అనుసంధానం కావడానికి మరెంత సమయం అవసరం? అప్పటి వరకూ చిన్నాభిన్నమై పోయే జీవితాలను ఏ విధంగా ఆదుకుంటారు? ఇలాటి సందేశాలు సవాళ్లతో అమరావతి అంటేనే అనుమానాల పుట్టగా ా మారిపోతున్నది.