అమరావతి అంశంపై సుప్రీంకోర్టులో తుది విచారణ జరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది. తాము ఏకైక రాజధానిగా అమరావతిని నిర్మించదల్చుకున్నామని ఇందు కోసం ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలతో సహా అఫిడవిట్ దాఖలు చేసింది.
అమరావతిని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఇందుకోసం తప్పుడు మార్గాల్లో చట్టాలు చేసింది. రైతులతో చేసుకున్న ఒప్పందాలను కాలరాసింది. ఇలా చేసిన చట్టాలను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. దీనిపై అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలల ఆలస్యంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మూడు రాజధానులకు అనుకూలంగా చేసిన చట్టాలు చెల్లుబాటు అవుతాయని వాదించింది. అయితే విచారణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా విచారణ జరగనుంది.
ప్రభుత్వం మారడంతో ఆటోమేటిక్ గా తమ వాదనను ప్రభుత్వం మార్చుకుంది. అమరావతి ఏకైక రాజధాని తమ విధానమని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. అంటేహైకోర్టు తీర్పును సమర్థిస్తున్నట్లే.. అంగీకరిస్తున్నట్లే. దీంతోసుప్రీం కోర్టు ధర్మాసనం కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం ఉండదని అంచనావేస్తున్నారు. అంటే.. అమరావతి రాజధానిగా శాశ్వత ముద్ర పడినట్లే. మరెవరూ కోర్టులకు కూడా వెళ్లలేరు. ఈ అంశంపై స్పష్టమైన తీర్పు సుప్రీంం నుంచి రావడమే కారణం అనుకవచ్చు.
జగన్ రెడ్డి అమరావతిని నిర్వీర్యం చేయడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు కానీ.. ఆయన వేసిన ప్రతి అడుగు తాత్కలికంగా అమరావతిని ఇబ్బందిపెట్టింది కానీ.. తర్వాత అదే అమరావతిని బలోపేతం చేసింది.