అమరావతి నిర్మాణ పనులను జనవరి ఒకటి నుంచి పట్టాలెక్కించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఇప్పటి వరకూ ఆర్థిక పరమైన సోర్సుల కోసం సర్వశక్తులు ఒడ్డారు. ఇప్పుడు వెసులుబాటు కనిపించడంతో పనులకు టెండర్లు ఖరారు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మొదటి దశలో మొత్తం 23 రకాల నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. భవనాలు,రోడ్లు,వరద నివారణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయిస్తూ పాలనాపరమైన అనుమతులను సీఆర్డీఏ ఇచ్చింది.
సోమవారం జరిగిన సమావేశంలో 11,467 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచెందుకు అధారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 360 కిమీల ట్రంక్ రోడ్లలో కు 2498 కోట్లతో కొన్ని రోడ్లకు పనులు ప్రారంభానికి ఆమోదం లభించింది. వరద నివారణ కు 1585 కోట్లతో పాల వాగు,కొండవీటి వాగు,గ్రావిటీ కెనాల్ తో పాటు రిజర్వాయర్లు నిర్మాణం, గెజిటెడ్,నాన్ గెజిటెడ్,క్లాస్ -4,అల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాలు పనులను 3523 కోట్లతో చేపట్టనున్నారు.
రైతులకు ఇచ్చిన రిటర్ణబుల్ లే అవుట్ లలో రోడ్లు,మౌళిక వసతుల కల్పనకు 3859 కోట్లు ఖర్చు పెట్టనున్నరాు. ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్ట్రీట్ లైట్స్,తాగు నీరు,ల్యాండ్ స్పింగ్…ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉండనున్నాయి. 5 ఐకానిక్ టవర్లు,అసెంబ్లీ,హై కోర్టు భవనాలు డిజైన్లకు టెండర్లు ఇప్పటికే పిలిచారు. డిసెంబర్ నెలాఖరుకు ఐకానిక్ భవనాలు కు టెండర్లు ఖరారు చేస్తారు. 5 కోట్ల మంది రాష్ర్ట ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం రాబోయే మూడేళ్లలో అమరావతి తొలి దశను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.