ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టి చూపించాల్సిందేనన్న పట్టుదలతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత… ప్రేమికుల రోజున.. ఏపీలో పర్యటించాలని డిసైడయ్యారు. అది కూడా.. అమరావతి టు విశాఖ కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నారు. అమరావతిలో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశం, ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు ఉంటాయి. సంయుక్త మీడియా సమావేశం కూడా కామన్‌గా ఉంటుంది. ఆ తర్వతా విశాఖ శారదా పీఠంలో జరిగే.. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్తారు. ఈ మేరకు ప్రత్యేక ఆహ్వాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద .. కేసీఆర్‌కు పంపడం… ఆయన సానుకూలత వ్యక్తం చేయడం కూడా జరిగిపోయాయి. అంటే.. ఫిబ్రవరి 14న ఏపీలో కేసీఆర్.. రెండు కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ రెండింటికి బయటకు రాజకీయాలకు సంబంధం లేదు కానీ.. రాజకీయానికి మించిన రాజకీయ సంబంధం ఉంది.
కేసీఆర్ .. ఏ కారణంతో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినా.. అది సున్నితమైన విషయంగా మారుతుందన్న అంచనాలున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఎలా చూసినా.. కేసీఆర్.. ఏపీకి వస్తే.. అది తనకు ప్లస్ పాయంట్ అవుతుందని అంచనా వేసుకుంటున్నారు. అందుకే.. కేసీఆర్‌ను తన గృహప్రవేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే.. గృహప్రవేశ ముహుర్తాన్ని నిర్ణయించారు. ఫిబ్రవరి పధ్నాలుగు కోసం ఇంటిని తుది మెరుగులు దిద్దుతున్నారు. అయితే… నివాసయోగ్యంగా మాత్రం .. అప్పుడే సాధ్యం కాదని.. మరో ఐదారు నెలలు పడుతుందని.. లాంఛనంగా మాత్రమే గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారని.. భవన నిర్మాణ వర్గాలుచెబుతున్నాయి. కేసీఆర్ ఏపీ పర్యటనకు ఓ కారణంగా.. గృహప్రవేశ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నారని భావిస్తున్నారు.
అదే సమయంలో.. స్వరూపానంద ఆశ్రమంలో.. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనకు కేసీఆర్ కు ఆహ్వానం లభించింది. స్వరూపానంద ఇప్పుడు కేసీఆర్, జగన్‌కు ఆధ్యాత్మిక గురువుగా మారారు. కేసీఆర్ కోసం.. ఆయన ఇటీవలే భారీ యాగాన్ని కూడా… కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నిర్వహించారు. గతంలో రాజశ్యామల హోమాన్ని కూడా చేయించారు. అందుకే.. ఫెడరల్ ఫ్రంట్ టూర్లను శారదాపీఠం నుంచే కేసీఆర్ ప్రారంభించారు. ఇక జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు అందజేయడానికి ఎక్కడికి వెళ్లమంటే.. అక్కడి వెళ్తున్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత తిరుమలకు వెిళ్లి మరీఆశీస్సులు అందించి వచ్చారు. ఇప్పుడు రాజకీయంగా కూడా.. ఆయన కేసీఆర్, జగన్‌కు మధ్య అనుసంధాన కర్తగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.