ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన కుటుంబంలో సాదాసీదాగా వేడుకలు జరిగితే ఆహా ఎంత నిరాడంబరం అనుకుంటారు. అదే సమయంలో వాళ్ల స్థాయికి తగ్గట్లుగా చేస్తే.. ఆడంబరం అని అనుకోరు.. ఇక్కడా గొప్పగా చెప్పుకుటంారు. ఆడంబరం అనేది.. తమ తాహతుకు మించి సంబరం చేసుకోవడం. కానీ అంబానీ ఏ రేంజ్ లో చేసుకున్న ఆడంబరం కాదు. ఇప్పుడు్ మరోసారి దాన్ని నిరూపిస్తున్నారు. ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ ఇటీవల అమెరికాలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. అక్కడ్నుంచి మొదటి సారి పిల్లలతో ఇండియాకు వస్తున్న సందర్భంగా అంబానీ ఫ్యామిలీ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.
ఇశా అంబానీ, ఆనంద్ పిరమాల్ దంపతులకు నవంబర్ 19 న లాస్ ఏంజెల్స్ లో కవల పిల్లలు జన్మించారు. ఇప్పుడు ఇండియాకు వచ్చారు. ఇద్దరు కవలల్లో ఒకరు మగ శిశువు కాగా మరొకరు ఆడ శిశువు. వీరికి కృష్ణ, ఆద్య అని పేరు పెట్టారు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ తమ మనవడు, మనవరాలికి ఘన స్వాగతం పలికారు. వీళ్లు ముంబయికివచ్చేందుకు ఖతార్ ఎయిర్ వేస్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. అమెరికాలోనే బెస్ట్ పీడియాట్రిషియన్ డాక్టర్ గిబ్సన్ నేతృత్వంలోని వైద్య బృందం
వీరితో పాటు ముంబై వచ్చారు. ప్రయాణంలో శిశువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వీళ్లంతా నిత్యం పర్యవేక్షించారు.
డిసెంబర్ 25న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పెద్ద మొత్తంలో విరాళాలూ ఇస్తారట. శిశువులను ఆశీర్వదించేందుకు దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు చెందిన పూజారులను పిలిపించింది అంబానీ కుటుంబం. మొత్తం మూడు వందలకేజీల బంగారాన్ని దానం చేయనున్నట్లుగా కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఒక్క బంగారం మాత్రమే అదని.. మిగతా దానాలు చాలా ఉంటాయని చెబుతున్నారు. మొత్తానికి ధనవంతుడి ఇంట్లో సంబరాలంటే.. కొన్ని వందల మందికి ధనయోగం పట్టుకుంటుందన్నమాట.