ఆంధ్రప్రదేశ్లో మంత్రులు బరి తెగించిపోయారు. నోటికి పని చెప్పడమే కాదు.. వారి మనసులు కూడా అంతే దారుణమని మరోసారి తేలిపోయింది. సత్తెనపల్లి ఎమ్మెల్యే , మంత్రి అంబటి రాంబాబు.. వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. సత్తెనపల్లికి చెందిన ఓ నిరుపేద కుటుంబంలోని యువకుడు.. డ్రైనేజీ పనికి వెళ్లి ఊపిరాడక చనిపోయాడు. ప్రభుత్వం రూ. ఐదు లక్షల పరిహారం చెక్కు మంజూరు చేసింది. అయితే అందులో రెండున్న లక్షలు తనకివ్వాల్సిందేనని అంబటి రాంబాబు నేరుగా ఆ నిరుపేద కుటుంబాన్నే బెదించారు.ఈ విషయం చెప్పుకుని ఆ పేద కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.
గుంటూరు దాసరిపాలెంకు చెందిన పర్లయ్య, గంగమ్మలు సత్తెనపల్లికి వలస వచ్చి రోడ్డు పక్కన గుడిసె వేసుకుని ఉంటున్నారు. వారికి మైనర్ కుమారుడు పనికి వెళ్తి ప్రమాదవెశాత్తూ చనిపోయాడు. దానిపై గొడవ చేయకుండా ప్రభుత్వ పరిహారం ఇప్పిస్తామని నచ్చ చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. ఐదు లక్షలు మంజూరు.. అయితే మున్సిపల్ చైర్ పర్సన్ భర్త..రెండున్నర లక్షలు తెచ్చి ఇస్తేనే చెక్కు ఇస్తామని కండిషన్ పెట్టారు. ఆ డబ్బుతో పిల్లకు పెళ్లి చేస్తామని.. తాము ఇవ్వలేమని చెబితే చెక్ కూడా ఇవ్వలేదు. ఇదే విషయాన్ని అంబటి రాంబాబుకు చెబితే.. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే..ఆయనకు కాకపోతే తాను తీసుకుటానని గదమాయించి పంపారు. మంత్రి , వైసీపీ నేతల తీరుతో కొడుకుని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.
పర్లయ్య, గంగమ్మలు తమ వేదన చెప్పుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. వారికి రక్షణ ఉండదని భావించిన ఓ పార్టీ నేతలు ఆజ్ఞాతంలోకి తరలించారు. అప్పటికే వారితో అదంతా అబద్దమని చెప్పేలా వీడియోలు తీసేందుకు వైసీపీ నేతలు ఒత్తిడి చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా కుమారుడ్ని కోల్పోయిన ఓ నిరుపేద కుటుంబానికి వచ్చిన పరిహారంలో సగం తాము మింగేయాలని చూడటానికి మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ప్రయత్నించడం.. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న దారుణమైన .. భయంకరమైన లంచాల వ్యవస్థకు అద్దం పడుతోంది. నిరుపేదల్ని సైతం పీల్చి పిప్పి చేస్తున్నారు. శవాల మీద పేలాలు ఏరుకునేందుకూ వెనుకాడటం లేదు.