ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా రెండు వీడియోలు విడుదల చేశారు. తాజాగా అంబటి వంతు. అంబటి అంబటి రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్ ఈ వీడియోను విడుదల చేశారు.
అసలు అంబటి రాంబాబు మనిషే కాదని, శవాల పేలాలు ఏరుకునే రకం అంటూ ఆయన అల్లుడు ఆరోపించారు.అంబటి రాంబాబు అల్లుడ్ని కావడం తన దురదృష్టం అన్నారు. దానికి ఎవరూ ఏం చేయలేదు. ఈ వీడియో చేయాలా వద్దా అని నేను బాగా ఆలోచించి.. చేయడం నా బాధ్యతగా భావించి ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు అని మండిపడ్డారు. శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నా జీవితంలో చూడలేదు. రోజూ దేవుడికి దండం పెట్టుకొనేటప్పుడు ఇంతటి నీచుడ్ని ఇంకోసారి నా జీవితంలో ఇంట్రడ్యూస్ చేయకుస్వామి అని మొక్కుకుంటాననన్నరాు.
మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఆయనలో అవి లేవన్నారు. వంద శాతం ఉండక్కర్లేదు 0.001 శాతం లక్షణాలు కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు అని తేల్చేశారు. నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని అయినా అబద్ధాన్ని కూడా నిజంగా చేసేయగలమనే కాన్ఫిడెన్స్‌తో బతుకుతారో సమాజంలో.. అలాంటి వాటికి ఓటేస్తున్నట్లు. ఎంత లేకి పని అయినా చేసి సమాజంలో చాలా గౌరవంగా బతకొచ్చు అని అనుకునే వారికి ఓటేస్తున్నట్లు. ఏదైనా చేసి సిగ్గులేకుండా సిగ్గులేని తననాన్ని ప్రోత్సహించవచ్చని అనుకునేవాళ్లకి ఓటేస్తున్నట్లు. ఇలాంటివారికి ఓటు వేస్తే సమాజం కూడా ఇలాగే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి మీ సరైన ఓటును బాధ్యతతో సరైన వ్యక్తికి వేసి, మంచి నాయకుడ్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నానని గౌతమ్ పిలుపునిచ్చారు.
మీ అల్లుడు మిమ్మల్ని ఇంత ఘోరంగా తిట్టారని మీడియా ప్రినిధులు అంబటిని కాంటాక్ట్ అయితే.. ఆయన నో కామెంట్ అని సమాధానం ఇస్తున్నారు.