అంబటి రాంబాబు తన ఇంట్లో ఉన్న సోషల్ మీడియా సైకోను పోలీసులకు అప్పగించారు. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అంబటి వద్ద సోషల్ మీడియా కార్యకర్తగా పని చేస్తున్నారు. ఆయన హోంమంత్రి అనితపై తప్పుడు పోస్టులు పెట్టారు. ఈ పోస్టులపై నూజివీడులో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో అరెస్టు చేయడానికి వస్తే ఆయన అంబటి ఇంట్లో దాక్కున్నారు. ఎక్కడ ఉన్నా అరెస్టు చేస్తారని తన ఇంట్లో ఉన్నారంటే ఇంకా చెడ్డపేరు వస్తుందని మీడియా ముందు తానే ప్రకటించారు. ఫలానా వ్యక్తి తన దగ్గరే ఉన్నాడని.
పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని అరెస్టు చేసి తీసుకుపోయారు. అతను అంబటి రాంబాబు ఇంట్లోనే ఉన్నాడు. తానే పోలీసులకు పట్టించానని అంబటి రాంబాబు మీడియాకు ఆఫ్ ది రికార్డు చెప్పుకున్నారు. ఇదేదో బాగుందని సోషల్ మీడియా సైకోను పోలీసులకు పట్టించిన అంబటి అని ప్రచారం చేసుకున్నారు. వీడియో కూడా అంతే వచ్చింది. దీంతో వైసీపీ నేతలకు షాక్ తగిలినట్లయింది. తన దగ్గర పని చేస్తున్న వ్యక్తిని కాపాడుకోవాలి కానీ ఇలా ముద్ర వేసి జైలుకు పంపడం ఏమిటో అని మిగతా వాళ్లు ఆశ్చర్యపోయారు.
సోషల్ మీడియాలో పోస్టులు అత్యంత జుగుప్సాకరంగా ఉండటంతో కోర్టుల్లో న్యాయమూర్తులు కూడా వారిని క్షమించలేకపోతున్నారు. జగన్ రెడ్డి కిడ్స్ అని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లు నిజంగా కిడ్స్ అయితే వాళ్ల జీవితాల్ని నాశనం చేసింది జగన్ రెడ్డే అనుకోవాలి. అసలు నెట్ వర్క్ చేధించిన తర్వాత ఈ విషయంపై అందరికీ ఓ స్పష్టత వస్తుంది.