పోలవరం చాలా క్లిష్టమైన సబ్జెక్ట్ అది ఎవరికీ అర్థం కాదు.. ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు కాబట్టి ..అనేశారు మాజీ నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు. మంత్రి పదవి వచ్చినప్పుడు ప్రెస్ మీట్లో స్పిల్ వే, కాఫర్ డ్యాం అంటే ఏంటో తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి.. మంత్రి అయితే అన్నీ తెలియాలా అని ఎదురుదాడి చేశారు. ఆయన తెలివి తేటలకు అప్పుడే అంతా అబ్బురపడ్డారు.
తర్వాత పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు పోలవరం పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని తాను ఎప్పుడో చెప్పానని.. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చెప్పారని..దాని కోసం పోలవరం పోవాలా… అన్నట్లుగా మాట్లాడారు.పోలవరం ప్రాజెక్టు చాలా టఫ్ సబ్జెక్ట్ అని అది ఎవరికీ అర్థం కాదని.. ఎందుకంటే తనకూ అర్థం కాలేదని వాదించేశారు.
చాలా గొప్పగా చెప్పానని అంబటి రాంబాబు అనుకున్నారేమో కానీ.. తనను తాను ట్రోల్ చేసుకున్నారని తర్వాత గుర్తు వచ్చి ఉంటుంది. అప్పటికి చేయగలిగిందేమీ లేదు. వైరల్ అయిపోయింది. అంబటి రాంబాబు అంటేనే.. ఓ కామెడీ పీస్ అన్నట్లుగా డాన్సులు..ఇతర మాటలతో వైరల్ అయ్యారు. ఇప్పుడు పోలవరం విషయంలో తనకేమీ తెలియని మరోసారి చెప్పుకుని ఇంకా కమెడియన్ అయ్యారు. కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తో ఆడుకున్నారని మాత్రం ఆయన గుర్తించడం లేదు.