తనను రాజకీయంగా ఎదుర్కోలేకే.. బ్రో సినిమాలో తన పేరు వచ్చేలా ఓ క్యారెక్టర్ ను పెట్టి కించ పరిచారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన .. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పై పంచులు వేయడాన్ని తనను రాజకీయంగా ఎదుర్కోలేకపోవడంగా చెప్పుకున్నారు. కానీ.. ఆయన కాస్త తల పైకెత్తి చూసి ఉంటే… తన బాస్ జగన్ రెడ్డి తీయిస్తున్న సినిమాల పోస్టర్లు కనిపించేవేమో.
పవన్ కల్యాణ్, చంద్రబాబు క్యారెక్టర్లను కించపరిచే విధంగా కోట్లు బడ్జెట్ పెట్టి సినిమాలు తీయిస్తున్నారు వైఎస్ జగన్. రెండు సినిమా వర్మతో.. మరో- సినిమా యాత్ర తీసిన దర్శకుడితో చేయిస్తున్నారు. గతంలోనూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీయించారు. ఇవన్నీ … ఆ ఇద్దరు నేతల్ని రాజకీయంగా ఎదుర్కోలేక తీయించినట్లు కాదా అన్న సందేహాలు సహజంజగానే అందరికీ వస్తాయి. కానీ వైసీపీ నేతలు తాము చేసేది మాత్రమే నిజం.. ఇతరులు చేసేది తప్పు అనే భావనలో ఉంటారు. అంబటి కూడా అంతే ఉన్నారు.
అంబటి వేసే వెర్రి వేషాలకు ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్ని మీమ్స్ వస్తాయో చెప్పడం కష్టం. ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి.. జగన్ రెడ్డి సర్కార్ నైజం తెలుసు కాబట్టి క్రియేటర్లు చాలా మంది అంబటి స్ఫూఫ్ క్యారెక్టర్లను రెడీ చేసుకుని కూడా కిల్ చేసుకున్నారు. అసలు ఆయన రాసలలీల గురించి అనేక స్కిట్లు టాలీవుడ్ రచయితలు రెడీ చేసుకున్నారు. ఆయన పదవి పోయిన తర్వాత అన్నీ బయటకు రావొచ్చు. అప్పుడు ఎలా ఫీలవుతారో మరి !