సత్తెనపల్లి వైసీపీ నుంచి అంబటి రాంబాబును గెంటేసి ఆ స్థానాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు జగన్. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు దానికి అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా ఆయన సత్తెనపల్లి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై వెటకారం చేశారు. తాను పాతిక వేల ఓట్ల తేడాతో ఓడిపోతే మూడు రోజులు నిద్రపోలేదని కానీ ఒకయన 90 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడని తెలిసి తనకు ధైర్యం వచ్చిందన్నారు.
ఈ 90 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది ఎవరో కాదు.. మంగళగిరి అభ్యర్థి. అక్కడ గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీచేయకపోయినా ఆయనే ముందుండి నడిపించారు. లోకేష్ ను ఓడిస్తానని సవాల్ చేశారు.కానీ ఆయన ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు ఆ సీటులో వర్కవుట్ కాదని సత్తెనపల్లి వైపు చూస్తున్నారు. జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాను 2014లో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయానని 2019లో భారీగా గెలిచానని స్పష్టం చేశారు.
గత ఎన్నికల్లో ఏం చేసినా గెలిచేవాళ్లం కాదని తేలిపోయిందని అంటున్నారు. అంటే ఆయన చెప్పేది జగన్ రెడ్డి నిర్వాకంతో రాష్ట్రం మొత్తం వైసీపీ నాకిపోయింది.. ఒక్క సత్తెనపల్లిలో కాదని. ఆయన వల్లే ఓడిపోయాం కానీ తన వల్ల కాదని. పరోక్షంగా ఈ అర్థం వచ్చేలా చెబుతున్నారు. రేపు సీటును మార్చేసి ఇళ్లకు ఇచ్చినట్లుగా అధికారిక ప్రకటన చేసిన తర్వాత ఆయన బహిరంగంగానే సూటిగా ఈ వ్యాఖ్యలు చేసినా ఆశ్చర్యం లేదు.