వైసీపీ మాజీ మంత్రికి నేల మీద కాలు నిలవడం లేదు..విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏకగ్రీవం అయ్యేలా ఉండడంతో తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు..అదేదో పోటీలో నిలబడి గెలిచినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. ఇక , వైసీపీకి తిరుగులేదని ప్రకటిస్తున్నారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికతో వైసీపీకి పూర్వ వైభవం వస్తుంది అని ఎక్స్ లో పోస్ట్ చేశారు అంబటి రాంబాబు. మొన్నటి ఎన్నికల ఫలితాలతో వైసీపీ క్యాడర్ పూర్తిగా నిరాశలో ఉంది..ఇప్పుడు దాన్నుంచి బయటపడేసేందుకు అంబటి ఈ ట్వీట్ చేసినా.. ఈ ఏకగ్రీవ ఎన్నిక వైసీపీ పూర్వ వైభవానికి ఎలా సంకేతమో అర్థం ఎవరికీ అర్థం కావడం లేదు.
టీడీపీ అభ్యర్థిని బరిలో నిలిపే అంశంపై సమాలోచనలు జరపగానే వైసీపీ బెదిరిపోయింది. క్యాంప్ పాలిటిక్స్ షురూ చేసింది. అయినా , ఇదేదో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని మట్టి కరిపించి అధికార పార్టీపై విజయం అందుకున్నట్లుగా అంబటి ట్వీట్ ఉంది.
ఇప్పటికే రెండు నెలల్లోనే కూటమిపై వ్యతిరేకత వచ్చేసిందని జగన్ ఊహాలోకంలో తేలియాడుతుండగా..ఇప్పుడు ఆయనకు జతగా అంబటి కూడా కలిశారు అంటూ సెటైర్లు పేలుతున్నాయి.