పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఐ ప్యాక్ రూట్ మ్యాప్ లో గుంటూరులో పలు ప్రాంతాలు తిరిగేస్తున్న అంబటి రాయుడుకు అమరావతి సమస్య గురించి పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వలేదు. అలా ఇవ్వకుండానే రాజధాని గ్రామాల్లోకి పంపించారు. దీంతో అంబటి రాయుడు ఇరుక్కుపోయారు. తన గుంటూరులో గ్రామాల్లో పర్యటనల్లో భాగంగా వెలగపూడిలోని వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్లారు. అయితే.. విషయం తెలుసుకొని అమరావతి రైతులు అక్కడికి చేరుకున్నారు. అమరావతికి సంఘీభావం తెలుపాల్సిందిగా అంబటి రాయుడును కోరారు.
తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని కోరారు. జై అమరావతి అనాలని అడిగారు. కానీ పరిస్థితి తెలుసు కాబట్టి అమరావతికి జై కొడితే.. జగన్ రెడ్డి ఇక తాడేపల్లి ప్యాలెస్ వైపు కూడా రానివ్వరు. దీనిపై క్లారిటీ ఉందేమో కానీ.. వారు అడిగిన విధంగా అనుకూల నినాదాలు చేయటానికి అంబటి రాయుడు నిరాకరించారు. తమ శిబిరానికి రావాలని రైతులు కోరారు. మరోసారి వస్తానని చెప్పుకుని… అమరావతి ఎక్కడికి వెళ్ళదని కవర్ చేసుకుని అక్కడ నుంచి వెళ్లి పోయారు. అంబటి రాయుడు గుంటూరు జిల్లాను టార్గెట్ చేసుకుని రాజకీయాల్లోకి రావాలనుకున్న ప్రదాన సమస్యలు, వాటిపై వైసీపీ విధానంపై అవగాహన తెచ్చుకుని గ్రామాల్లోకి వెళ్తే బెటర్ ఉండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఆయన టూర్స్ ని కోఆర్డినేట్ చేస్తున్న ఐ ప్యాక్ టీం కూడా సరిగ్గా గైడ్ చేయలేదు. దీంతో అమరావతి రైతుల ను నొప్పించలేక.. అటు ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించలేక బుక్కయిపోయారు. ఆయన ఇలా రైతుల మధ్య కార్నర్ కావడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రైతులకు మద్దతు ప్రకటించకపోవడంతో రాజధానిని వ్యతిరేకిచినట్లయిందని దాని వల్ల రాయుడుకు గుంటూరులో పెద్ద మైనస్ అవుతుందన్న చర్చ జరుగుతోంది.