ఆడుదాం ఆంధ్రా ఓపెనింగ్ ప్రోగ్రాంలో జగన్ రెడ్డి ఆడారు. రోజా ఆడారు. ఇద్దరూ కలిసి క్రికెట్ ఆటలో మెళకువలు నేర్చుకున్నారు.. నేర్పారు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్ కూడా వస్తాయని హడావుడి చేస్తున్నారు. అదంతా సరే కానీ.. జగన్ రెడ్డి పార్టీతో రాసుకుని. పూసుకుని తిరుగుతున్న క్రికెటర్ అంబటి రాయుడు ఎందుకు రాలేదన్నది చర్చనీయాంశమవుతోంది. ఆయనను పిలవలేదా లేకపోతే.. ఆయనే రాలేదా అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.
ఆడుదాం ఆంధ్రాకు మంచి క్రేజ్ రావడానికి క్రికెటర్ అంబటి రాయుడు ఉపయోగపడతారు అందులో సందేహం లేదు. కానీ వాడుకున్నారు కూడా. తీరా ఓపెనింగ్ కు మాత్రం ఆయన కనిపించలేదు. అంబటి రాయుడ్ని ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఆయన వస్తే జగన్ రెడ్డిపై ఫోకస్ తగ్గిపోతుందని అందుకే ఆయనను పిలవలేదని చెబుతున్నారు. జగన్ రెడ్డి ఈ ప్రోగ్రాంలో ఏం చేయాలి.. ఎలా చేయాలి అనేది ముందే స్క్రిప్ట్ రెడీ అయింది. దానికి తగ్గట్లుగా షూట్ చేశారు. కోచింగ్ అందులో భాగం. అవి వైరల్ అయ్యా.యి.
అదే అంబటి వస్తే ఆయనపై ఫోకస్ ఉంటుంది. ఇది జగన్ రెడ్డికి ఇష్టం ఉండదని అందుకే ఆహ్వానించలేదని చెబుతున్నారు. మరో వైపు .. వైసీపీలో తిరిగిన కొద్ది రోజులకే అక్కడి పరిస్థితి గురించి అంబటికి తెలిసిపోయిదని.. తన దగ్గర ఉన్నదంతా నాకేసి వదిలేస్తారని అంచనాకు వచ్చి క్రమంగా దూరమవుతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. ఎందుకు రాలేదో తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ఫోన్ చేస్తే అంబటి పీఏ.. ఆరోగ్యం బాగోలేదని చెప్పారు కానీ.. ఆయన మాత్రం మాట్లాడేందుకు నిరాకరించారు.