జగన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు.. అయినా కాన్వాయ్ లో జామ్ అని తిరుగుతూంటే ఇతర వైసీపీ నేతలకు తమకు మాత్రం ఏం తక్కువ అనిపిస్తోంది. తనకు ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీ కల్పించాలని అంబటి రాంబాబు కోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకూ తనకు ఆ సెక్యూరిటీ ఉందని వాదించారు.
అంబటి రాంబాబు పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపనుంది. ఆయన ఓడిపోయే వరకూ మంత్రి. ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ ఇచ్చి ఉంటారు. ఇప్పుడు ఆయన మంత్రి కాదు..కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. కానీ తనకు మంత్రి రేంజ్ సెక్యూరిటీ కొనసాగాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫోర్ ప్లస్ ఫోర్ అంటే వై ప్లస్ సెక్యూరిటీ అనుకోవచ్చు. పోనీ అంబటి ఏమైనా ఫ్యాక్షన్ గొడవల్లో తలదూర్చి వాళ్లకు టార్గెట్ అయ్యాడా … లేకపోతే హోంమంత్రి గా నక్సలైట్ల ఎన్ కౌంటర్లకు కారణయ్యాడా అంటే.. అలాంటివేమీ లేదు.
ఎవరైనా చనిపోతే వారికి ప్రభుత్వ పరిహారం ఇప్పించి కమిషన్లు తీసుకోవడం వంటి పనులు చేశాడు.. దానికే ప్రాణహాని ఉండే అవకాశం లేదు. అయినా భద్రత తగ్గించారంటూ కోర్టుకెళ్లారు. పదవులు పోయినా.. జనాలు కోరలు పీకేసినా.. తమ రేంజ్ అలాగే కొనసాగాలని వీరు ఆశపడుతున్నారు. కానీ సెక్యూరిటీ రివ్యూ కమిటీ కొన్ని చర్యలు తీసుకుంటుంది. అవసరం లేని వాళ్లకు సెక్యూరిటీ ఇవ్వదు. కోర్టు కూడా దాన్ని కాదనదు. ఆ విషయం తెలిసి కూడా వైసీపీ నేతలు కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి