కేంద్ర నిధులపై కేసీఆర్ సెక్రటేరియట్‌కు వస్తే తెలుస్తుదందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సెటైర్ వేశారు. తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల చివరి రోజుల ఆయన ప్రచారానికి వచ్చారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొన్నారు. తర్వాత బీజేపీ కార్యాలయంలో ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారు. గత ఎన్నికల తర్వాత వంద రోజుల ప్రణాళిక అన్నారు.. ఏమైంద?
లక్ష ఇళ్లు కడతామన్నారు.. ఏమైంది?: 15 డంప్ యార్డ్స్ నిర్మించాల్సి ఉంటే.. ఒక్కటైనా నిర్మించారా? గాంధీ, ఉస్మానియా తరహాలో నాలుగు ఆస్పత్రులన్నారు.. ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందని.. కేసీఆర్ ఫామ్ హౌస్నుంచి బయటకు రావాలన్నారు. హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేస్తాం.. పర్యాటక కేంద్రంగా మారుస్తామని హమీ ఇచ్చారు. కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్‌లో చేరకపోవడం వల్ల పేదలకు సరైన వైద్యం అందడం లేదన్నారు. తము సీట్లు పెంచుకోవడానికి కాదని.. మేయర్ సీటు గెలుచుకోవడానికే పోటీ చేస్తున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధుల వివరాలను అమిత్ షా వెల్లడించారు. తెలంగాణలో లక్షా 30 వేల ఇళ్లకు కేంద్రం నిధులిచ్చిందని.. చిరువ్యాపారులకు కేంద్రం ఇచ్చిన రుణాలలో.. తెలంగాణ వారికే ఎక్కువ ఇచ్చామన్నారు. మోదీ విధానాల వల్లే హైదరాబాద్‌కు పలు విదేశీ సంస్థలు వచ్చాయన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామని హమీ ఇచ్చారు.
హైదరాబాద్ వరదల గురించి కూడా ప్రస్తావించారు. సిటీలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ అడుగు బయటకు పెట్టలేదని మండిపడ్డారు. నాలాపలపై ఎంఐఎం అండతోనే అక్రమ కట్టడాలు పెరిగాయని.. బీజేపీకి అవకాశమిస్తే.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలను తొలగిస్తామని ప్రకటించారు. తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం ఒక్కటే కాదని… ఇంకెవరికీ పరిపాలనా సామర్థ్యం ఇంకెవరికీ లేదా? మండిపడ్డారు. నిజాం నవాబుల నగరం నుంచి ఆధునిక నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామని హమీ ఇచ్చారు. భాగ్యలక్ష్మీ ఆలయానికి భక్తితో వెళ్లాను.. రాజకీయ కారణాలు లేవని స్ఫష్టం చేశారు. గల్లీ ఎన్నికలకు ఇంత మంది ఎందుకు వస్తున్నారన్న టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు అమిత్ షా కౌంటర్ ఇంచారు. ఏ ఎన్నికలనూ బీజేపీ తక్కువగా చూడదన్నారు.