కేంద్ర హోంమంత్రి అమిత్ షా సేఫ్. అదేంటి..? ప్రత్యేకంగా ఏ సందర్భమూ లేకపోయినా సేఫ్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది..? అనే డౌట్ సహజంగానే వస్తుంది. దానికి కారణం అమిత్ షానే. ఆయనే.. ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై .. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అనేక పుకార్లు నడుస్తున్నాయని…వాటిని తాను ఇంతకాలం పట్టించుకోలేదన్నారు. కానీ ఇప్పుడు అవి శృతి మించడంతో లేఖ విడుదల చేశారు. తన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమేనన్నారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదన్నారు.
ఇలాంటి ప్రచారాలు చేసే బదులు ఎవరి పని వారు చేసుకుంటే బెటర్ అని..సలహా ఇచ్చారు. ఇంతకీ అమిత్ షా ఆరోగ్యంపై ఎందుకు..? ఏమని ప్రచారం జరిగిందనే విషయంపై…అమిత్ షా లెటర్ తర్వాత ఎక్కువ మంది సెర్చ్ చేశారు. అమిత్ షాకు బోన్ క్యాన్సర్ అని చికిత్స తీసుకుంటున్నారని.. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాలంటూ హిందీలో పెద్ద ఎత్తున పోస్టులు సర్క్యూలేట్ అయ్యాయి.
వాటిని బీజేపీ లైట్ తీసుకుంది.కానీ రాను రాను ఎక్కువైపోవడంతో అమిత్ షా ఇలాంటి ప్రకటన చేశారు. దేశంలో కరోనా ప్రభావం ప్రారంభమైన తర్వాత అమిత్ షా పూర్తి సమయం పని చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తరపున అన్ని రాష్ట్రాలను సమన్వయం చేసుకుని పనులు చేస్తున్నారు. ఆయన అంత బిజీగా ఉంటే… సోషల్ మీడియా లో కొంత మంది మాత్రం ఆయన ఆరోగ్యంపై పడ్డారు.