ముఖ్యమంత్రి జగన్మహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఇది కామనే కానీ.. హోంమంత్రి అమిత్ షా రాత్రి తొమ్మిది గంటలకు సమయం కేటాయించారని.. అధికారికంగా మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే.. అమిత్ షాతో భేటీ.. రాత్రి పది తర్వాతే ఉంటుందని.. అనధికారికంగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి అమిత్ షా.., రాత్రి ఏడు గంటల తర్వాత అధికారిక కార్యక్రమాలు.. అధికారిక అంశాలపై సమీక్షలు చేయడం.. మీటింగ్‌లు పెట్టడం చేయరని అంటారు. కానీ అదేంటో కానీ…సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా… రాత్రి తొమ్మిది గంటల తర్వాతే అపాయింట్మెంట్ ఖరారు చేస్తారు.
అధికారిక సమావేశాలు అయితే.. అమిత్ షా… అఫీషియల్ టైంలోనే పూర్తి చేస్తారని.. రాత్రి తొమ్మిది తర్వాత అనధికారిక మీటింగ్లకే ప్రాధాన్యం ఇస్తారని.. బీజేపీ నేతలు చెబుతూంటారు. ఈ కారణంగా సీఎం జగన్ అమిత్ షాతో భేటీ ఎజెండా పర్సనల్ అనే చర్చను టీడీపీ నేతలు తెర ముందుకు స్తున్నాయి. రఘురామకృష్ణరాజును సైలంట్ చేయాలన్న లక్ష్యంతో ఉన్న జగన్.. దాన్నే ప్రధానంగా ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్తారని అంటున్నారు. ఎంపీలు కొంతమంది హస్తినలో మకాం వేసి రఘురామకృష్ణరాజు చేస్తోన్న ఆరోపణలపై ప్రభుత్వం వైఖరిని కేంద్ర మంత్రులను కలసి వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారు చేసిన ప్రయత్నాలకు తోడు..జగన్… ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక ఇస్తారని అంటున్నారు.
తొలుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లాలని చూశారు. ఆ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ చివరి నిమిషంలో రద్దైంది. ఇప్పుడు ఖరారైంది. అయితే అనేక సార్లు ఢిల్లీకి వెళ్లిన తర్వాత అపాయింట్మెంట్లు రద్దు చేయడంతో వెనక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వాలకు సంబంధించిన అధికారిక సమావేశాలైతే… ముఖ్యమంత్రులు అడిగిన వెంటనే సమయం చూసుకుని చాన్సిస్తారు. కానీ ఏపీ సీఎం తీరు మాత్రం డిఫరెంట్‌గా ఉంది. అయితే.. ఆయ రాష్ట్రం కోసమే… ఢిల్లీకి వెళ్తున్నారని.. తర్వాత ప్రెస్‌నోట్ విడుదలవుతుంది. అది ఆవుకథలా.. ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.