కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. సమావేశాలు జరుగుతున్నాయి. అఖిల భారత క్షేత్ర సమన్వయ భైఠక్ గా దీన్ని చెబుతున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరయ్యారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు.. ఆరెస్సెస్అగ్రనేతలంతా.. వచ్చారు. కానీ మీడియాకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. వారి సమావేశాలు జరిగే చోటుకు ఎవర్నీ అనుమతించడం లేదు. ఒక్క ఫోటోను కానీ.. వీడియోను కానీ తీయడానికి అంగీకరించడం లేదు. అత్యంత రహస్యంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఆరెస్సెస్ కనుసన్నల్లోనే పని చేస్తుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా..ఆరెస్సెస్ అనుబంధ సంఘాలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తూటాయి. బీజేపీ బూత్ కమిటీల కన్నా.. ఆరెస్సెస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు చేసే ప్రచారమే ఎక్కువ ప్రభావం చూపిస్తూంటుందనే ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది. అదే సమయంలో.. ప్రభుత్వంపైనా ఆరెస్సెస్ ముద్ర ఉంటుంది. ఇటీవలి కాలంలో.. ప్రభుత్వ వైఫల్యాలపై.. ఆరెస్సెస్ అగ్రనేతల్లో అసహనం పెరిగిందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఏం చేయాలన్నదానిపై.. ఆరెస్సెస్ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా ఈ సమావేశాలకు హాజరవడమే దీనికి సంకేతం. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో.. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు..మళ్లీ హిందుత్వ ఎజెండాను భుజన ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉందని.. ఆరెస్సెస్ తీర్మానించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రామ్ మందిర్ అంశంతో పాటు..మరిన్ని సున్నితమైన విషయాలపై.. కేంద్రం వివాదాస్పద నిర్ణయాలతో… హిందూత్వ అజెండాను తెరపైకి తేవచ్చని… ఆరెస్సెస్ వ్యూహకర్తలు సూచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఏం మాట్లాడుకుంటున్నారు.. ఏం చర్చించుకుంటున్నారన్నది మాత్రం పూర్తి సస్పెన్స్‌నే.