విజయసాయిరెడ్డి అతి ప్రవర్తన.. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో హాట్ టాపిక్ అయింది. సందర్భం లేకపోయినా ఆయన జగన్ ప్రస్తావన తీసుకొచ్చి… అమిత్ షాతో చీవాట్లు తినాల్సి వచ్చింది. సమావేశంలో… కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు.. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు చిదంబరానికి అవకాశం ఇవ్వాలని ఆజాద్ కోరారు. ప్రస్తుతం చిదంబరం.. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జైల్లో ఉన్నారు. ఆజాద్ చెప్పిన అంశాన్ని అమిత్ షా నోట్ చేసుకున్నారు. అయితే.. విజయసాయిరెడ్డి ఈ సందర్భంలో కలుగుచేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని పదహారునెలల పాటు జైల్లో పెట్టాలని.. చిదంబరానికి ఒక న్యాయం.. జగన్ కు మరో న్యాయమా అంటూ.. గొంతెత్తారు. దీంతో.. అందరూ విజయసాయిరెడ్డి వైపు విచిత్రంగా చూశారు.
సందర్భం లేకుండా జగన్ జైలు జీవితం గురించి ప్రస్తావన తెచ్చి.. చిదంబరం అంశంతో పోల్చడంతో.. అమిత్ షా అసహనానికి గురయ్యారు. కాంగ్రెస్ చెప్పిన అంశాన్ని తాము నోట్ చేసుకున్నామని.. మధ్యలో మీ అభ్యంతరం ఏమిటని అమిత్ షా ప్రశ్నించడంతో.. విజయసాయిరెడ్డి సైలెంటవ్వాల్సి వచ్చింది. విజయసాయిరెడ్డి తీరును.. అఖిలపక్ష సమావేశంలో ఉన్న ఇతర పార్టీల ప్రతినిధులు కూడా.. తప్పు పట్టారు. విజయసాయిరెడ్డి అనవసరంగా.. జగన్మోహన్ రెడ్డి జైలు జీవితాన్ని అఖిలపక్ష సమావేశంలో గుర్తు చేశారన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమయింది. చిదంబరాన్ని మరికొంత కాలం జైలులో ఉంచాలని.. వాదించి.. బీజేపీ మెప్పు పొందుదామని ఆయన అనుకున్నారు.
కానీ.. దానికి రివర్స్‌లో మొత్తం జరగింది. అమిత్ షా ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. వ్యక్తిగత హజరు నుంచి మినహాయింపు కోసం జగన్ వేసిన పిటిషన్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించడంతో.. ఆయనకు ఊరట దక్కలేదు. త్వరలో తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఉన్న వారిపై.. త్వరిగతిన విచారణ జరిపించనున్నారన్న ప్రచారం నేపధ్యంలో.. విజయసాయిరెడ్డి హడావుడి.. అన్నీ పార్టీల వారిని.. ఆశ్చర్య పరిచింది.