ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు ముఖ్యంగా “వైసీపీ ఫ్యాన్స్”కు అమిత్ షా గట్టి సందేశం సూటిగా సుత్తిలేకుండా ఇచ్చి వెళ్లినట్లుగా స్పష్టమయింది. ముఖ్యంగా ఏం జరిగినా ముందు ప్రతిపక్షాన్ని కారణంగా చూపించి ఆనక అనాలి కాబట్టి అనాలన్నట్లుగా వైసీపీ ప్రభుత్వాన్ని సుతిమెత్తగా విమర్శించే టీంకు … ” చేతకాకపో చెప్పండి ..మేమే చూసుకుంటాం ” అని అమిత్ షా నేరుగానే హార్డ్ హిట్టింగ్ చేసినట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతిలోని తాజ్ హోటల్లో జరిగిన సమావేశంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ భవిష్యత్ ప్రణాళికను బయట పెట్టాయన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది.
యూపీలో ఎంపీగా ఉండి ఏపీలో రాజకీయాలు చేసే జీవీఎల్ నరసింహారావు వైసీపీకి వీరాభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏపీకి వస్తే ఆయన పర్యటనలో వైసీపీ నేతలు కనిపిస్తూ ఉంటారు. ఆయన ప్రభుత్వాన్ని ఎంతలా డిఫెండ్ చేయాలో అంతా చేస్తారు. చివరికి వైసీపీ దాడులు, దౌర్జన్యాలను కూడా సమర్థిస్తారు. ఇక పోటుగాడిగా ప్రచారం చేసుకుని ఏపీలో బీజేపీ పరిస్థితుల్ని చక్కదిద్డడానికని వచ్చిన సునీల్ ధియోధర్ జీవీఎల్‌కు డూప్ వెర్షన్‌లా రాజకీయాలు చేస్తూంటారు. ఇక లోకల్‌గా ఉండే బీజేపీ నేతల్లో వైసీపీ ఫ్యాన్స్ ఎవరో విడమర్చి చెప్పాల్సిన పని లేదు.
ప్రతిపక్ష పార్టీపై విమర్శుల చేస్తూ అధికార పార్టీపై సైలెంట్‌గా ఉండటాన్ని అమిత్ షా నేరుగా ప్రశ్నించి ఇక నుంచి నుంచి మారకపోతే చేయాల్సింది చేస్తామని చెప్పడంతో మిగతా నేతలకు సౌండ్ లేకుండా పోయినట్లయిందంటున్నారు. ఏబీఎన్‌ను బ్యాన్ చేసిన అంశంపైనా సోము వీర్రాజుకు రిమార్కులు పడ్డాయి. ఎవర్ని అడిగి ఆ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించండతో సమాధానం చెప్పలేకపోయారు. అమరావతి రైతుల విషయంలో సోము వీర్రాజు సమావేశంలో అమిత్ షా ఎదుట దారుణమైన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. వారు కాంట్రాక్ట్ రైతులని అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో అమిత్ షా మండిపడినట్లుగా కూడా చెబుతున్నారు.
ఎలా చూసినా అమిత్ షా వైసీపీతో సన్నిహితంగా నేతలకు గట్టి క్లాస్ పీకి భవిష్యత్ కావాలంటే వైసీపీపై పోరాడాల్సిదేనని స్పష్టమైన సూచనలు ఇచ్చి వెళ్లారన్న అభిప్రాయం మాత్రం ఆ పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. సీఎం రమేష్ తర్వాత నేరుగా ఏబీఎన్ చానల్ డిస్కషన్‌లోకి లైవ్‌లోకి వెళ్లి ఏబీఎన్‌ను బీజేపీ బ్యాన్ చేయలేదని.. వ్యక్తిగతంగా ఎవరో తీసుకున్న నిర్ణయంతో సంబంధం లేదని ప్రకటించడంతో సోము వీర్రాజు పరువు గంగలో కలసి పోయినట్లయింది. మొత్తంగా చూస్తే వైసీపీ ఫ్యాన్స్ పలుకుబడి ఒక్క సారిగా ఏపీ బీజేపీలో అమిత్ షా టూర్ తర్వాత పాతాళంలోకి పోయిందని తేటతెల్లమయిందంటున్నారు.