కేసీఆర్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందంటూ.. అమిత షా ఖమ్మం జిల్లాకు వచ్చి పాత కథ వినిపించి వెళ్లారు. మూడు సార్లు వాయిదా పడిన తర్వాత ఖమ్మంలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. కానీ అసలు హైప్ లేకుండా సాదాసీదాగా నిర్వహించేశారు. పార్టీలో చేరికల్లేవు.. పేలిపోయంత జన సమీకరణ లేదు. పోనీ తెలంగాణకు బీజేపీ ఏం చెస్తుందో చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేశారా అంటే అదీ లేదు. ఎప్పుడూ చేసే విమర్శలను కేసీఆర్ పై చేసి వెళ్లిోపయారు. రైతు ఘోష అని పేరు పెట్టారు.. కానీ తాము వస్తే రైతులకు ఫలనా మేలు చేస్తామని చెప్పలేకపోయారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. గ్రెస్, BRS.. రెండూ కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ సోనియా కుటుంబం కోసం పనిచేస్తుంటే.. BRS కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తోందని విమర్శించారు కారు స్టీరింగ్ ఓవైసీ చేతుల్లో ఉంది. ఓవైసీతో కలిసి తెలంగాణ పోరాటయోధులను విస్మరించారని.. తెలంగాణ అమరుల కలను బీఆర్ఎస్ నాశనం చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోతుంది. తెలంగాణలో త్వరలోనే కమలం వికసిస్తుందని చెప్పుకొచ్చారు.
“కాంగ్రెస్ 4జీ పార్టీ, BRS 2జీ పార్టీ, MIM 3జీ పార్టీ. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మోదీజీ పార్టీనే… అని ప్రాస కోసం అమిత్ షా పాకులాడారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేరు. ఈసారి సీఎం అయ్యేది బీజేపీ నేత మాత్రమే. ఓవైసీ నడిపే కారు పార్టీని మళ్లీ గెలిపించొద్దని పిలుపునిచ్చారు. ఇతర నేతలు ఘాటుగానే మాట్లాడారు కానీ.. అసలు ఎన్నికల సభలా లేదని.. వారి పార్టీలో ఉన్న నిరసం అంతా బయటపడిందన్న వాదన వినిపిస్తోంది.
మరో వైపు కాంగ్రెస్ డిక్లరేషన్లు ప్రకటిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించి దూసుకెళ్తోంది. కానీ బీజేపీ మాత్రం.. ఓవైసీపీ కారు… కేసీఆర్ కారు దగ్గరే కబుర్లు చెప్పి… రాజకీయం చేస్తోంది.