అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. దీనికి కారణం తుపాన్. గుజరాత్ తీరాన్ని తీవ్రమైన తుపాను తాకనుండటంతో .. కేంద్ర హోంశాఖ మొత్తం గుజరాత్ పై దృష్టి పెట్టింది. అమిత్ షా కూడా నిరంతరం సమీక్షిస్తున్నారు. సొంత రాష్ట్రం కావడంతో ఆయన ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. దీంతో తెలంగాణ టూర్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో బీజేపీ నేతలకు షాక్ తగిలినట్లయింది.
అమిత్ షా వస్తారని.. తెలంగాణ బీజేపీలో పరిస్థితుల్ని చక్కదిద్దుతారని.. ఎదురు చూస్తున్న బండి సంజయ్ కు ఇది ఊహించని షాకే. ఆయనకు వ్యతిరేకంగా ఓ బలమైన గ్రూప్ రాజకీయాలు చేస్తోంది. ఆయనను మార్చాలని అంటోంది. అయితే బండి సంజయ్ కు హైకమాండ్ సపోర్ట్ ఉంది. ఆయనను తొలగించడం లేదు కానీ..ఇతర నేతల్ని పని చేయించేలా చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. వారంతా పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతున్న సమయంలో అమిత్ షా వచ్చి సెట్ రైట్ చేస్తారని అనుకున్నారు. కానీ తుపాను అడ్డం వచ్చింది.
అమిత్ షా పర్యటనలో మరో ఆసక్తికర పరిణామం జరిగేది.. అదే ఆంధ్రజ్యోతి ఆర్కేతో భేటీ. ఏపీలో రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఈ భేటీపై ఏపీ అధికార పార్టీలో టెన్షన్ ఏర్పడింది. రకరకాల ప్రచారాలు చేయడం ప్రారంభించారు. చివరికి టూర్ క్యాన్సిల్ కావడంతో వారంతా రిలీఫ్ ఫీలయ్యారు.