కరోనా పాజిటివ్‌కు వీఐపీలు.. వీఐపీలు.. సామాన్యులు అనే తేడా లేదు. దేశంలో మోడీ తర్వాత అత్యంత పవర్ ఫుల్ అనుకునే అమిత్ షాను కూడా.. కరోనా వదిలి పెట్టలేదు. తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని.. అమిత్ షా స్వయంగా ట్వీట్ చేశారు. తనను కలవడానికి వచ్చిన వారందరూ… సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లాలని కోరారు. ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. అయితే వైద్యుల సలహాతో.. అమిత్ షా ఆస్పత్రిలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పరిమితంగానే అపాయింట్మెంట్లు ఇస్తూ ఉంటారు కానీ.. అమిత్ షా మాత్రం… అన్ని వ్యవహారాలు చక్క బెడుతూ ఉంటారు.
కరోనా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయడానికి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. ఎక్కువ మందిని కలవడంతో.. ఎవరో ఒకరి నుంచి వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల అమిత్ షాకు స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో.. టెస్ట్ చేశారు. అందులో పాజిటివ్‌గా తేలింది. గతంలో.. అమిత్ షాకు.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండటంతో.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో.. ఫుల్ అబ్జర్వేషన్ లో ఉంచేందుకు ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మరో వైపు ఇరవై రోజుల కిందట.. కరోనా పాజిటివ్‌గా తేలిన సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. కోలుకున్నారు. ఆయనకు నెగెటివ్ రావడంతో… నానావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ప్రకటించారు. అభిషేక్‌కు కూడా.. పాజిటివ్ వచ్చింది. ఆయన కోలుకున్నారో లేదో చెప్పలేదు. అదే సమయంలో.. ఐశ్వర్యారాయ్, ఆరాధ్యకు కూడా పాజిటివ్ వచ్చింది. వారికి త్వరగానే కరోనా తగ్గిపోవడంతో…గత వారమే డిశ్చార్జ్ అయ్యారు.