ఆంధ్రజ్యోతి ఆర్కే ఇంటికి ఆమిత్ షా వెళ్తున్నారు. ఎవరైనా అమిత్ షాను కలవడానికి నేరుగా వెళ్తారు. కానీ తెలుగు మీడియా యజమానుల ఇళ్లకు అమిత్ షా వెళ్తున్నారు. గతంలో ఓ సారి రామోజీరావు ఇంటికి వెళ్లారు. ఇప్పుడు ఆర్కే ఇంటికి వెళ్తున్నారు. సంపర్క్ ఫర్ సమర్థన్ అనే ప్రోగ్రాం కింద తాను ఏ రాష్ట్రానికి వెళ్లినా తీరిక చేసుకుని సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల్ని కలవడాన్ని ఓ పనిగా పెట్టుకున్నారు అమిత్ షా. అందుకే ఆర్కేను కలుస్తున్నారు.
గతంలో కూడా ఓ సారి ఆర్కేను ఇంటికి వెళ్లి కలిశారు. ఇది రెండో సారి. అయితే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సున్నితంగా మారింది. బీజేపీ కీలకమయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్కే అమిత్ షాతో ఏం మాట్లాడతారనే టెన్షన్ ఆయన వ్యతిరేకుల్లో ఉంటుంది. ఇప్పటికే ఏపీలో .. ..బీజేపీ .. టీడీపీ ట్రాప్లో పడిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆర్కేతో అమిత్ షా భేటీ తర్వాత మరింత గా ఇలాంటి విమర్శలు పెంచే అవకాశం ఉంది.
ఆర్కే ఇటీవలి కాలంలో బీజేపీ స్ట్రాటజిస్ట్ అన్నట్లుగా కొన్ని సలహాలు ఇస్తున్నారు. బీజేపీ తెలంగాణలో హైప్ కోల్పోవడానికి కారణం కవితను అరెస్ట్ చేయకవడమేనని వాదిస్తున్నారు. మళ్లీ రేసులోకి రావాలంటే ఏం చేయాలో చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాలపై ఆయన సలహాలిచ్చే అవకాశం ఉంది. అవి ఎలాంటివోనని బయటటెన్షన్ పడే పార్టీలు వేరే ఉంటాయి.