నందమూరి బాలకృష్ణ 101వ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఎంట్రీ ఖాయమైపోయింది. బాలయ్య – కృష్ణవంశీ ల రైతు చిత్రంలో బిగ్ బీ… రాష్ట్రపతిగా కనిపించబోతున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. బిగ్ బీ ఇప్పటికే.. తన డేట్లు కూడా కన్ఫామ్ చేసేశారని తెలుస్తోంది. ఇప్పుడు చిరంజీవి కూడా బిగ్ బీతో గెస్ట్ రోల్ వేయించాలని ఆశ పడుతున్నాడని, త్వరలోనే బిగ్‌బీని కలుసుకొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ‘బుడ్డా’ ప్రమోషన్లలో భాగంగా అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ వచ్చిన్పపుడు ‘చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రావాలి.. ఆయన 150వ సినిమా చేయాలి.. చేస్తే అందులో నేను గెస్ట్ రోల్ వేయడానికి సిద్దమే’ అని మాటిచ్చారు. దాన్ని గుర్తు చేస్తూ ‘ఖైదీ నెం.150’లో బిగ్ బీ చేత.. ఓ గెస్ట్ రోల్ వేయించాలని ఆలోచిస్తున్నాడు చిరు. అమితాబ్ ఉంటే.. తన సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని, ఎలాగైనా సరే.. ఈ ఆఫర్‌ని వాడుకోవాలని చిరు భావిస్తున్నాడట. బిగ్ బీ చేత ఏ రోల్ వేయించాలా? అని చిరు తెగ ఆలోచిస్తున్నాడని, కనీసం రెండు నిమిషాల పాటు ఆ పాత్ర ఉన్నా సరిపోతుందని చిరు భావిస్తున్నాడని టాక్.
ఇప్పుడు అదే పనిలో భాగంగా వినాయక్.. పరుచూరి బ్రదర్స్‌తో మంతనాలు సాగిస్తున్నాడట. అంటే అమితాబ్ ని దృష్టిలో ఉంచుకొని ఈసినిమాలో ఓ గెస్ట్ రోల్‌ని సిద్దం చేయాలన్నమాట. మరి ఈ ఇరికించిన పాత్రకు సూపర్ స్టార్ ఓకే అంటాడా? ఇచ్చిన మాటని నిలబెట్టుకొంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు కోసం హోస్ట్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ షోకి ఆధ్యుడు అమితాబ్ బచ్చన్. అందుకే తెలుగులో చిరు.. అమితాబ్‌లతో ఓ ఎపిసోడ్ చేయాలని భావిస్తున్నారు. దాన్నుంచి కూడా అమితాబ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సివుంది.