జూన్ 6 తర్వాత తెలంగాణలో పెను మార్పులు ఉంటాయన్న అమిత్ షా వ్యాఖ్యల అంతర్యం ఏంటి..? మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రేవంత్ సర్కార్ ను కూల్చుతామని షా వ్యాఖ్యల సంకేతమా..? ఇప్పుడివే ప్రశ్నలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలోనూ షిండేలు పుట్టుకొస్తారని…రేవంత్ సర్కార్ పతనం ఖాయమని తెలంగాణ బీజేపీ నేతలు చెప్తుండగా తాజాగా రాష్ట్ర పర్యటనలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. జూన్ ఆరు తర్వాత తెలంగాణలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ప్రకటించడంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి.
కేంద్ర సర్కార్ టార్గెట్ గా రేవంత్ బలమైన విమర్శలు చేస్తుండటంతో మరోసారి అధికారంలోకి వస్తే రేవంత్ ను సీఎం పీఠం నుంచి దించడమే షా లక్ష్యంగా పెట్టుకున్నారా..? అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలను కూల్చిన అనుభవమున్న అమిత్ షా ఇప్పుడు తెలంగాణలోనూ అదే ప్రయత్నం చేస్తారా..? అని చర్చ జరుగుతోంది.