చెన్నై వాసులు వరదల్లో చిక్కుకుని తినడానికి తిండిలేక, తాగడానికి నీళ్లులేక నానా అవస్థలుపడుతుంటే అక్కడ చాపక్రిందనీరులా `అమ్మ మార్క్’ రాజకీయాలు సాగిపోతున్నాయి. బాధితులకోసం వివిధ రాష్ట్రాల నుంచి అందుతున్న నిత్యావసర వస్తువులపై జయ వీరాభిమానులు `అమ్మ స్టిక్కర్స్’ అంటించిన తర్వాతనే బాధితుల వద్దకు పంపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి తిరుగులేని సాక్ష్యాలతో సహా సమాచారం అందుతోంది.
ఇలా జరుగుతోంది…
బెంగుళూరు నుంచి వరదబాధితుల సహాయం కోసం ఒక ట్రక్కు చెన్నైకి బయలుదేరింది. చెన్నై శివార్లకు చేరేసరికి అన్నాడిఎంకె పార్టీ కార్యకర్తలమని చెప్పుకునే కొంతమంది యువకులు ఆ ట్రక్కును అటకాయించారు. వరద బాధితులకోసం నిత్యావసర వస్తువులు చేరవేస్తున్నామని చెప్పగానే వారంతా ఎగిరిగంతేశారు. అప్పటికప్పుడు తమతోపాటు తెచ్చుకున్న అమ్మ బొమ్మ ఉన్న స్టిక్కర్ల కట్టను ట్రక్కులోని వాళ్లకు అందించారు. ప్రతి ప్యాకెట్ మీద అమ్మ ఫోటో ఉన్న స్టిక్కర్ ఉండేలా చూడాలనీ, లేకపోతే అవి బాధితులకు చేరవని హెచ్చరించారు. ట్రక్కులోని వారు అందుకు అంగీకరించిన తర్వాతనే అది ముందుకు కదిలింది. పునారావసకేంద్రానికి చేరగానే సరుకు దింపించారు. అన్నాడిఎంకె కార్యకర్తలమని చెప్పుకునే వారి పర్యవేక్షణలో అన్ని ఆహారపొట్లాలమీద, దుప్పట్లు, ఇతర వస్తువుల మీద స్టిక్కర్స్ అంటించేలా చూశారు. ఈ తతంగమంతా ముగిసిన తర్వాతనే బాధితులకు వాటిని అందజేశారు. అవి అందుకున్న బాధితులు `అమ్మ దయ’కు మురిసిపోయారు. బాధితుల కళ్లలోని ఆనందం చూసిన కార్యకర్తలు తమ పని అయిపోయిందనుకుని మరో ట్రక్కును వలవేసి పట్టుకునేపనిలో పడిపోయారు.
ఇది ఒక్క కర్నాటక నుంచి వచ్చే వాహనాలకే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి రోజూ వస్తున్న వరదసహాయక ట్రక్కులను సదరు కార్యకర్తలు ఇలాగే నిలిపివేస్తున్నారు. `అమ్మ మార్కింగ్’ వ్యవహారానికి సంబంధించిన ఫోటోలు, వ్యాఖ్యలు సోషల్ మీడియా (ట్విట్టర్, ఫేస్ బుక్)లో హల్ చల్ చేస్తుండటంతో పార్టీ నాయకులు ఇప్పుడు కంగారుపడిపోతున్నారు. ఇలా చేస్తున్నవారంతా `అమ్మ’ అభిమానులవ్వచ్చేమోగానీ, పార్టీ కార్యకర్తలుకారని బుకాయించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సోషల్ మీడియాలో….
– చెన్నైవాసులు కష్టాలనుకూడా పూర్తి రాజకీయం చేస్తున్నారు. వైపరీత్యాలప్పుడు సైతం పార్టీ కార్యకర్తలను ఎలా ఉపయోగించుకోవాలో నాయకులకు బాగా తెలిసినట్లే ఉంది.
– సహాయక చర్యలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని సీనియర్ మంత్రులు చెబుతున్నారు. `బ్రహ్మాండం’ -అంటే ఇదేనా…?
– వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. అందుకే ప్రతిపక్షాలవారు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు – సీనియర్ మంత్రి వాఖ్య (ఓర్నీ ! రేపు పార్టీ జెండాలు పట్టుకుని తిరిగినా ఇలాగే తప్పించుకోవచ్చన్నమాట)
– అమ్మ స్టిక్కర్స్ ఉదంతంతో రాజకీయ జలగలు ఉన్నట్లు మరోసారి తేలింది.
– ప్రజలు అందించిన బియ్యాన్ని తెల్లటి ప్లాస్టిక్ సంచుల్లో నింపేసి, దానిపై అమ్మ స్టిక్కర్స్ ను అంటిస్తున్నారు. ఇంతకంటే సాక్ష్యం ఇంకేమి కావాలి.
– స్వయం సహాయక బృందాలు తెచ్చిన నిత్యావసర వస్తువలపై అమ్మ ఫోటోలు అంటించి, ఆమె `దయ’తో పంపినట్లు కలరింగ్ ఇస్తున్నారు. థూఁ…
– అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడన్నది పాత సామెత. `ప్రజల సొమ్ము అమ్మ దానం’- ఇది కొత్త సామెత.
– చెన్నై సరిహద్దుల వద్ద రాత్రిపూట అన్ని ప్రధాన రహదారులపై అమ్మ వీరాభిమానులు కాపుకాసి వరద బాధితుల సహాయంకోసం వస్తున్న ట్రక్కులను ఆపేస్తున్నారు. అమ్మ స్టిక్కర్స్ అంటించకపోతే బెదరిస్తున్నారు. ఇంతకంటే నీచమైనది మరొకటి ఉంటుందా?
– వరద కంటే, ఈ వరద రాజకీయమే చెన్నై వాసులను బాధిస్తోంది.
– కణ్వస