జైల్లో నుండి నామినేషన్ వేశాడు. ఇండిపెండెంట్ గా లోక్ సభ ఎన్నికలకు పోటీ చేశాడు. ప్రచారానికి కూడా దూరమే… గెలిచాడు. కాను తాను అరెస్ట్ అయ్యింది జాతీయ భద్రతా చట్టం కింద. ఖలీస్తాన్ సానుభూతి పరుడు. బెయిల్ రాకపోవటంతో, పెరోల్ కింద బయటకు రాబోతున్నారు. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసి మళ్లీ జైలుకు వెళ్లబోతున్నారు.
అమృత్ పాల్ సింగ్. ఖలీస్తాన్ సానుభూతి పరుడు. వారిస్ పంజాబ్ దే అధిపతి. ఈ సంస్థ ద్వారా ప్రజలను రెచ్చగొడుతున్నారన్న ఉద్దేశంతో జాతీయ భద్రతా చట్టం కింద ఫిబ్రవరి 23న అరెస్టయ్యాడు. జైల్లో నుండే పంజాబ్ రాష్ట్రంలోని ఖాదూర్ షాహెబ్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందాడు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైనందున కోర్టు నాలుగు రోజుల పాటు పెరోల్ మంజూరు చేయటంతో జైలు నుండి విడుదలయ్యారు.
శుక్రవారం ఎంపీగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నాలుగు రోజుల పాటు తన తల్లితండ్రులను కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. మీడియాతో మాట్లాడకుండా షరతులు విధించింది.